Kavitha: నటి కవిత జీవితంలో కనిపించని విషాదాలేన్నో.. అప్పుడే చనిపోవాలనుకుందట.. కానీ..
చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలోనే 20 ఏళ్లకే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యాను. దీంతో అప్పటికే నా చేతిలో అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటికి కంప్లీట్ చేసి సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాను.

బాలనటిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత కథానాయికగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందల చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు నటి కవిత. సిరిసిరి మువ్వ సినిమాతో తెలుగు తెరకు పరియమైన ఆమె.. ఆ తర్వాత తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించారు. 20 ఏళ్ల వయసులోనే వ్యాపారవేత్త దశరాథరాజ్ ను పెళ్లి చేసుకున్న ఆమె.. ఆ తర్వాత కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తర్వాత తల్లిగా.. అత్తగా.. వదినగా ఇలా ఎన్నో పాత్రలలో కనిపించారు. కవిత వివాహం చేసుకున్న వ్యక్తి కొన్ని వందల కోట్లకు అధిపతి. కానీ వ్యాపారంలో నష్టం రావడంతో కోట్లు నష్టాపోయారని.. ఆ తర్వాత భర్త, కొడుకు మరణంతో తాను చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
కవిత మాట్లాడుతూ.. “చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలోనే 20 ఏళ్లకే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యాను. దీంతో అప్పటికే నా చేతిలో అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటికి కంప్లీట్ చేసి సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాను. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత సహాయ నటిగా ఎంట్రీ ఇచ్చాను. అమ్మ, వదినా, కోడలుగా ఇలా అన్ని పాత్రలలో నటించాను. ఇక నా వ్యక్తిగత జీవితానికి వస్తే.. మావారికి వందల కోట్ల ఆస్తులు ఉన్న మాట వాస్తవమే. 11 దేశాల్లో ఆయనకు ఆయిల్ బిజినెస్ లు ఉండేవి. ఆయన నన్ను ఒక రాణిలా చూసుకునేవారు. నా ఇష్టాలను గౌరవించేవారు.




ఏడేళ్ల క్రితం వ్యాపారంలో నష్టం రావడంతో సుమారు రూ.132 కోట్లు పోగొట్టుకున్నారు. కొన్ని ఆస్తులు కూడా అమ్మేశారు. ఆ సమయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యి దాదాపు 11 రోజులు కోమాలో ఉన్నారు. కరోనా అందరి జీవితాల్లో ఏదో ఒక రకంగా చీకట్లు మిగిల్చింది. నా భర్త, కుమారుడు అదే సమయంలో చనిపోయారు. బాబు చనిపోయిన పదిరోజులకే ఆయన కన్నుమూశారు. ఆ బాధను తట్టుకోలేక చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. కానీ నా కూతుళ్లను చూసి ఆగిపోయాను. ఆ బాధ నుంచి బయటపడేందుకు మళ్లీ సినిమాల్లో బిజీ కావాలనుకుంటున్నాను.. అవకాశాలు వస్తే తప్పుకుండా నటిస్తాను. ” అంటూ చెప్పుకొచ్చారు.
