BoyapatiRAPO: రామ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడ్డట్లే.. బోయపాటి మార్క్ ఫస్ట్ థండర్. వీడియో చూస్తే పునకాలే..
రామ్ పోతినేని దున్నపోతుతో కలసి ఊరమాస్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ విజువల్స్ విజిల్స్ కొట్టేలా ఉండగా.. రామ్ చెప్పే డైలాగ్స్ ఇక కేక పుట్టిస్తున్నాయి. ఇందులో రామ్ కు బోయపాటి తనదైన మార్క్ ఎలివేషన్స్ ఇవ్వగా.. థమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.
అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో బోయపాటి ఓ సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీలీల కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీను పాన్ ఇండియా లెవల్లో ఏకంగా ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈరోజు రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి బోయపాటి ర్యాపో ఫస్ట్ థండర్ పేరుతో స్పెషల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఆ వీడియోలో రామ్ పోతినేని దున్నపోతుతో కలసి ఊరమాస్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ విజువల్స్ విజిల్స్ కొట్టేలా ఉండగా.. రామ్ చెప్పే డైలాగ్స్ ఇక కేక పుట్టిస్తున్నాయి. ఇందులో రామ్ కు బోయపాటి తనదైన మార్క్ ఎలివేషన్స్ ఇవ్వగా.. థమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడమే కాకుండా.. రామ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడ్డేట్లే అని తెలుస్తోంది.
ఇందులో శ్రీలీల మాత్రమే కాకుండా.. సాయి మంజ్రేకర్ కీలకపాత్రలో కనిపించనుంది. చాలా రోజుల క్రితమే ప్రారంభమైన ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ 20న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే 60శాతం షూటింగ్ కంప్లీట్ కాగా… త్వరలోనే పూర్తిగా చిత్రీకరణ పూర్తి కానుంది. మొత్తానికి టీజర్ తో రామ్ పోతినేని అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేశాడు బోయపాటి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.