Actress Gautami: సీనియర్ హీరోయిన్ గౌతమి ప్రాణాలకు ముప్పు.. పోలీసులకు ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..
సినీరంగంలో ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించింది గౌతమి. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్ హీరోహీరోయిన్లకు తల్లి పాత్రలు పోషిస్తుంది. తాజాగా నటి గౌతమి పోలీసులను ఆశ్రయించింది. తన ప్రాణాలకు హాని ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. ఆస్తి తగాదాల కారణంగానే ఈ బెదిరింపులు వస్తున్నాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

సినీనటి, రాజకీయ నాయకురాలు గౌతమి పోలీసులను ఆశ్రయించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఆస్తి వివాదానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు రోజూ బెదిరింపులు వస్తున్నాయని.. దీంతో తాను ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. చెన్నైలోని నీలంకరైలో ఉన్న రూ.9 కోట్ల విలువైన ఆస్తికి సంబంధించి ఈ బెదిరింపులు వస్తున్నాయని.. ఆ ఆస్తిని అళకప్పన్ అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ గౌతమి గతంలో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతుంది. కోర్టు ఆదేశాల మేరకు ఈ వివాదాస్పద భూమిపై సీలు చేశారు.
అయితే తనను కొంతమంది అధికారులు లంచం అడుగుతున్నారని, మరికొంతమంది న్యాయవాదులు ఆ స్థలంో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని బెదిరిస్తున్నారని గౌతమి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే కొందరు నిరసనకు ప్లాన్ చేస్తున్నారని తనకు తెలుసని, అది తనకు హాని కలిగించే పథకంలో భాగమని అనుమానిస్తున్నానని గౌతమి తెలిపారు.
ఇన్నాళ్లు బీజేపీ కార్యకర్తగా ఉన్న గౌతమి.. గతేడాది ఎఐఎడిఎంకెలో చేరారు. తన ఆస్తిని దొంగిలించిన వ్యక్తిని పార్టీ నాయకత్వం రక్షించడానికి ప్రయత్నించిందని ఆరోపిస్తూ నటి బీజేపీ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం నటి గౌతమి సినిమాల్లో బిజీగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..




