AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..

దక్షిణాది సినీప్రియులకు ఇష్టమైన హీరోలలో సూర్య ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇటీవలే రెట్రో సినిమాతో ప్రేక్షకులను ముందుకు వచ్చిన సూర్య.. మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. తాజాగా తన డైట్ సీక్రెట్ రివీల్ చేశారు సూర్య.

Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..
Kollywood Hero Suriya
Rajitha Chanti
|

Updated on: May 17, 2025 | 10:49 AM

Share

తమిళ చిత్రపరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య. హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే కంగువా, రెట్రో చిత్రాలతో అడియన్స్ ముందుకు వచ్చారు. కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన రెట్రో సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఇదిలా ఉంటే.. సూర్య వయసు ప్రస్తుతం 49 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ యంగ్ కుర్రాడిలా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. సూర్య ఫిట్నెస్ ప్రియుడు.

49 ఏళ్ల వయసులో కూడా, ఫిట్‌నెస్‌ను కాపాడుకునే విషయంలో సూర్య రాజీ పడటానికి ఇష్టపడటం లేదు. గతేడాది విడుదలైన కంగువ చిత్రంలో సిక్స్ ప్యాక్ తో కనిపించి వయసు కేవలం నంబర్ మాత్రమే అని మరోసారి నిరూపించాడు. అయితే ఇటీవల తన ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేశారు సూర్య. 49 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ పొందడం అనేది అంత తేలికైన పని కాదని.. ఇప్పటికీ రోడ్డుపై పరుగులు పెడుతున్నట్లుగా అనిపిస్తుందని అన్నారు. అలాగే తనతోపాటు తన భార్య, కూతురు సైతం భోజన ప్రియులు అని.. తన కొడుకు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడని చెప్పుకొచ్చాడు.

కంగువ సినిమా కోసం తాను 100 రోజుల డైట్ ప్లాన్ పాటించానని..అందులో భాగంగా కేలరీలను పూర్తిగా తగ్గించానని.. కార్డియో వ్యాయామాలను చేయడం.. జీవనశైలిలో పూర్తిగా మార్పులు చేశానని తెలిపారు. 100 రోజులు కఠినమైన డైట్ పాటించానని అన్నారు. 49 ఏళ్ల వయసులో జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయని డైటీషియన్ విధి చావ్లా అన్నారు. ఈ వయసులో డైట్ పాటించడం వల్ల బరువు నియంత్రణ, ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్