AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. కోట్లలో ఆస్తులు.. చివరకు బూజు పట్టిన ఇంట్లో ఒంటినిండా పైపులతో..

80వ దశకంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సులక్షణ. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఆపై హీరోయిన్‌గా, ఆ తర్వాత సహయ నటిగా రాణించింది. కే. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'శుభోదయం' (1980) చిత్రంలో చంద్రమోహన్ సరసన హీరోయిన్‌గా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Tollywood : ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. కోట్లలో ఆస్తులు.. చివరకు బూజు పట్టిన ఇంట్లో ఒంటినిండా పైపులతో..
Savitri
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2026 | 12:34 PM

Share

తెలుగు సినిమా చరిత్రలో మహానటి సావిత్రి స్థానం అద్వితీయం. ఆమె అభినయం, సౌందర్యం నేటికీ ఎందరికో ఆదర్శం. అయితే, ఆమె తెర వెనుక జీవితం మాత్రం విషాదాంతం. సీనియర్ నటి సులక్షణ, సావిత్రి జీవితంలోని వైభవాన్ని, అనంతరం ఎదురైన పతనాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా, ఆమె జీవితం నుండి తాను నేర్చుకున్న పాఠాలను ఓ కార్యక్రమంలో పంచుకున్నారు. సులక్షణ ప్రకారం.. సావిత్రి ఒకప్పుడు ఎంతో వైభవంగా జీవించారు. ఖరీదైన చీరలు, నగలు, లగ్జరీ కార్లతో ఆమె జీవితం ఒక రాణిలా ఉండేది. అయితే, ఎంత సంపాదించినా ఆమెకు ఆర్థిక క్రమశిక్షణ లేదని సులక్షణ వెల్లడించారు. “పదివేలు వస్తే పది నిమిషాల్లో ఖర్చు పెట్టేవారు” అని సులక్షణ గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, ఎల్లప్పుడూ స్టార్‌గానే ఉంటామని, తమకు ఇదే జీవితం కొనసాగుతుందని సావిత్రి బలంగా నమ్మేవారట. ఈ నమ్మకమే పొదుపు లేమికి, అనవసర ఖర్చులకు దారితీసిందని సులక్షణ అన్నారు. విలువైన వస్తువులపై విపరీతమైన ఆసక్తి, డిన్నర్ సెట్లు వంటి వాటికి భారీగా ఖర్చు పెట్టడం కూడా ఆమె అలవాట్లలో ఒకటని గుర్తు చేసుకున్నారు.

సులక్షణ నేర్చుకున్న పాఠాలు:

సావిత్రి జీవితాన్ని దగ్గరగా చూసిన సులక్షణకు ఎన్నో గుణపాఠాలు లభించాయి. “ఏమేం చేయకూడదు, ఏమేం చేయాలి” అని సావిత్రి జీవితం నుండి నేర్చుకున్నానన్నారు. ముఖ్యంగా, సావిత్రికి ఉన్నట్లుగా ఎటువంటి అలవాట్లను తాను అలవర్చుకోలేదన్నారు. 18 ఏళ్లకే వివాహం చేసుకోవడం ద్వారా తాను సురక్షితంగా ఉన్నానని, పరిశ్రమలో ఎదురయ్యే అనవసరమైన “ఐ లవ్ యూ” వంటి ఆకర్షణల నుండి దూరంగా ఉండగలిగానని ఆమె పేర్కొన్నారు.

సావిత్రి చివరి రోజులు, వారసత్వం:

సావిత్రి చివరి రోజులు అత్యంత దయనీయంగా గడిచాయని సులక్షణ కళ్లారా చూశారు. అనారోగ్యంతో, ఒంటరిగా, పాత ఇంట్లో ఫ్యాను, ఫర్నిచర్ కూడా లేకుండా ఆమె మంచంపై పడుకొని ఉండటాన్ని సులక్షణ వివరించారు. ఆమె శరీరం ఎంతగా కుంచించుకుపోయిందో, ఆమెను గుర్తించడం కూడా కష్టంగా మారిందని సులక్షణ చెప్పారు. అప్పుడు జెమిని గణేషన్ ఆమెను చూసుకోలేదని ఆమె పేర్కొన్నారు. కమల్ హాసన్, చిరంజీవి వంటి మహానటులు కూడా సావిత్రి అభినయం నుండి ఎంతో నేర్చుకున్నామని చెప్పే వైనం, ఆమె గొప్పతనాన్ని చాటుతుంది. మళ్లీ సావిత్రమ్మ పుట్టదని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని సులక్షణ అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..

ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..

Follow Us