AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. కోతి బొమ్మతో వరుస చావులు.. తెలుగులోనూ చూడొచ్చు

కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో ప్రేక్షకులను బాగా భయపెట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను వణికేందుకు వచ్చింది. శుక్రవారం (జూన్ 26) అర్ధరాత్రి నుంచే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. కోతి బొమ్మతో వరుస చావులు.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 26, 2026 | 11:26 AM

Share

ఎప్పటిలాగే ఈవారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేశాయి. బ్లాస్ట్, అవతార్ వంటి సినిమాలు ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా శుక్రవారం (జూన్ 26) అర్ధరాత్రి నుంచి మరికొన్ని సినిమాలు, సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. బాహుబలి ద టార్చ్ బేరర్ డాక్యుమెంటరీ, లింగం, ముతస్సీ లాంటి వెబ్ సిరీస్ లు ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అయితే వీటితో పాటు ఒక హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఆడియెన్స్ ను బాగా భయపెట్టింది. అప్పట్లో తెలుగులో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన అమ్మో బొమ్మ సినిమా గుర్తుందా? ఈ సినిమా కథ కూడా దాదాపు ఇలాంటిదే. ఇంటి అటకపై దొరికిన ఓ కోతి బొమ్మ వల్ల ఆ చుట్టుపక్కల వరుస మరణాలు సంభవిస్తాయి. మరి ఈ కోతి బొమ్మ వెనక ఉన్న కథేంటి? ఆ దుష్టశక్తికి ఎలా అడ్డుకట్ట వేశారన్నదే ఈ సినిమా కథాంశం.

హాలీవుడ్ లెజెండరీ స్టీఫెన్ కింగ్ కలం నుంచి జాలువారిన ఒక భయంకరమైన చిన్న కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది మంకీ’ (The Monkey). దర్శకుడు ఓజ్‌గూడ్ పర్కిన్స్ తెరకెక్కించిన ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు థియో జేమ్స్ ప్రధాన పాత్ర పోషించారు. లిజా వుడ్, కోలిన్ ఓబ్రెయిన్, రోహన్ కాంప్‌బెల్, సారా లెవీ, ఆడమ్ స్కాట్ కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో ఆడియెన్స్ ను భయపెట్టిన ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇవాళే మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లోకి కూడా వచ్చేసింది. ఇంగ్లిష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ వంటి నాలుగు భాషల్లో ది మంకీ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్ లో బెస్ట్ హారర్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ది మంకీ మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలో హింసాత్మక సీన్స్, భయానక సన్నివేశాలు చాలా ఉన్నాయి. కాబట్టి పిల్లలతో కలిసి చూడకపోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

రెండు ఓటీటీల్లో ది మంకీ సినిమా స్ట్రీమింగ్.. తెలుగులోనూ ఉంది..

ది మంకీ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us