Krishna Bhagavan: నేను, ఆ స్టార్ హీరోలంతా కలిసి ఒకే ఇంట్లో అద్దెకు ఉండే వాళ్లం: స్టార్ కమెడియన్ కృష్ణ భగవాన్
తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన టైమింగ్ ఉన్న కమెడియన్లలో కృష్ణ భగవాన్ ఒకరు. సందర్భానికి తగ్గట్టుగా ఆయన వేసే పంచులు, ప్రాసలకు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం జబర్దస్త్ షోకు జడ్జీగా వ్యవహరిస్తోన్న ఆయన తన జీవితం గురించి కొన్నిఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

1988లో వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణ భగవాన్. ఆ తర్వాత ఏప్రిల్ 1 విడుదల సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. అయిదే దీని తర్వాత చాలా ఏళ్ల వరకు సినిమాల్లో కనిపించలేదీ సీనియర్ యాక్టర్. మళ్లీ 2003లో ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు కృష్ణ భగవాన్. ఇక ఆ తర్వాత తిరిగి వెనక్కు చూడలేదీ కమెడియన్. వరుస సినిమాలతో బిజీ బిజీగా మారిపోయారు. కబడ్డీ కబడ్డీ, దొంగరాముడు అండ్ పార్టీ, లక్ష్మీ నరసింహా, అందరూ దొంగలే, చెప్పవే చిరుగాలి, లీలామహల్ సెంటర్, వెంకీ, గోపి గోపిక గోదావరి, సరదాగా కాసేపు, మంగతాయారు టిఫన్ సిఎటర్, ఆపరేషన్ దుర్యోధన, దుబాయ్ శీను.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి నవ్వించారు కృష్ణ భగవాన్. జాన్ అప్పారావు 40 ప్లస్, బొమ్మన బ్రదర్స్ అండ్ చందన సిస్టర్స్ సినిమాల్లో హీరోగానూ మెప్పించారీ సీనియర్ యాక్టర్. అయితే 2018 తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు కృష్ణ భగవాన్. మళ్లీ ఇప్పుడిప్పుడే సినిమాల్లో కనిపిస్తున్నారు. అలాగే జబర్దస్త్ షోకు జడ్జీగానూ వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు కృష్ణ భగవాన్. ఇదే సమయంలో కొందరు స్టార్ హీరోలు, డైరెక్టర్ల గురించి తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. అప్పట్లో ఆయన హీరోలు రవితేజ, వేణు తొట్టెంపూడి, డైరెక్టర్ వైవీఎస్ అందరూ కలిసి ఒకే ఇంట్లో అద్దెకు ఉండే వాళ్లట. అయితే ఆ ఇంటి యజమానికి కుక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టమని అందుకే అనేక కుక్కలు పెంచేవాడట. దానికి ప్రతీ రోజూ తమను చూపించి ట్రైనింగ్ ఇచ్చే వారని కృష్ణ భగవాన్ గుర్తు చేసుకున్నారు. మేం సినిమా వాళ్లు కావడంతో రాత్రిళ్లు ఇంటికి ఆలస్యంగా వచ్చేవాళ్ల మని కుక్కల భయంతో ప్రతీ సారి గేట్లు, గోడలు దూకి ఇంట్లోకి వచ్చే వాళ్లమంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు కృష్ణ భగవాన్. ప్రస్తుతం ఈ జబర్దస్త్ జడ్జీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా రవితేజ, కృష్ణ భగవాన్ కాంబినేషన్ లో వెంకీ, దుబాయ్ శీను వంటి పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

Krishnabhagwan, Ravi Teja
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




