AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: మీరు వెళ్లాల్సిన ట్రైన్ ఆలస్యమైందా..? ఆన్‌లైన్ ద్వారా పరిహారం పొందొచ్చు.. ఇలా దరఖాస్తు చేస్కోండి..

రైళ్లల్లో తరచూ లక్షలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. దేశ నలుమూలకు రైల్వే నెట్ వర్క్ విస్తరించి ఉంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా రైల్వేల ద్వారా సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం అత్యంత వేగంగా గమ్యస్థానానికి చేర్చే వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.

Indian Railways: మీరు వెళ్లాల్సిన ట్రైన్ ఆలస్యమైందా..? ఆన్‌లైన్ ద్వారా పరిహారం పొందొచ్చు.. ఇలా దరఖాస్తు చేస్కోండి..
Indian Railways
Venkatrao Lella
|

Updated on: Jun 26, 2026 | 12:13 PM

Share

ప్రయాణికుల కోసం రైల్వేశాఖ అనేక నియమాలు పాటిస్తోంది. ఒకవేళ మీరు ప్రయాణం చేయాల్సిన రైలు ఆలస్యమవైతే రైల్వేశాఖ నుంచి పరిహారం పొందవచ్చు.  రైళ్లు వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ ఉంటాయి. కొన్నిసార్లు గంటల కొద్ది ఆలస్యమవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ట్రైన్ కోసం ఫ్లాట్‌ఫామ్‌లపై ప్రయాణికులు వెయిట్ చేస్తూ ఉంటారు. ట్రాక్ మరమ్మత్తులు, ఇతర కారణాల వల్ల ట్రైన్ గంటల కొద్ది ఆలస్యమైతే పరిహారం పొందే హక్కు ప్రయాణికులకు ఉంటుంది. ఈ మేరకు రైల్వేశాఖ నిబంధనలను తీసుకొచ్చింది. రైలు ఎంత సమయం ఆలస్యమైతే పరిహారం అందుతుంది..? ఏయే కారణాల వల్ల లేట్ అయితే పరిహారం ఇస్తారు? ప్యాసింజర్లు ఎవరికి సంప్రదించాలి? క్లెయిమ్ చేసుకోవడం ఎలా? లాంటి అన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

క్లెయిమ్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఎలా..?

-ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లోకి వెళ్లండి

-ఫైల్ టీడీఆర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-మీ టికెట్ పీఎన్‌ఆర్ నెంబర్ ఎంటర్ చేయండి

-డ్రాప్ మోనూ నుంచి కారణాన్ని ఎంచుకోండి

-ప్రయాణికుల సంఖ్యను ఎంటర్ చేయండి

-ఫైల్ టీడీఆర్ బటన్ క్లిక్ చేయండి

-సూచనలన్నీ చదివి ఎస్ బటన్‌పై క్లిక్ చేయండి

-మీ ఫైలింగ్ సక్సెస్ అయినట్లు మెస్సేజ్ వస్తుంది

ఎలాంటి సమయంలో పరిహారం అందుతుంది..?

-ట్రైన్ మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే పరిహారం అందుతుంది

-రిజర్వేషన్ టికెట్ ఉన్నవారికి మాత్రమే పరిహారం ఇస్తారు

-అయితే రైలు ఆలస్యానికి సంబంధించిర కారణాన్ని ప్రయాణికులకు ముందే చెప్పినా లేదా ప్రయాణం సమయంలో చెప్పినా క్లెయిమ్ చేసుకోలేరు

-ఇక తుఫాన్లు, వరదలు, రైలు ప్రమాదాల వల్ల మీ రైలు ఆలస్యమైతే ప్రత్యేక టికెట్ కౌంటర్ వద్ద మీరు చెల్లించిన టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తారు

-విపత్తులు, సాంకేతిక కారణాలు మినహా ఇతర కారణాల వల్ల ట్రైన్ ఆలస్యమైతే పరిహారం కోరవచ్చు

-ఇక ట్రైన్ దారి మళ్లించడం, ఏసీ పని చేయకపోవడం వంటి కారణాలతో కూడా టీడీఆర్ ఫైల్ చేయొచ్చు

-కోచ్ సమస్యల కారణంగా లోయర్ క్లాస్‌లో జర్నీ చేసినా టీడీఆర్ ఫైల్ చేయవచ్చు

-మీరు ప్రయాణిస్తున్న ట్రైన్‌లో ఏసీ పనిచేయకపోపతే ట్రైన్ గమ్యస్థానానికి చేరుకున్న 20 గంటల్లోపు ఫైల్ చేయాలి

-టీడీఆర్ ఫైల్ చేస్తే మీ టికెట్ డబ్బులు, పరిహారం మీ అకౌంట్లో జమ అవుతాయి

-రైల్వే టికెట్ కౌంటర్లను సంప్రదించి ఆఫ్‌లైన్‌లో కూడా టీడీఆర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

-ట్రైన్‌ను దారి మళ్లించడం ద్వారా బోర్డింగ్ స్టేషన్‌లో ట్రైన్ ఎక్కలేని సమయంలో కూడా టీడీఆర్ ఫైల్ చేయవచ్చు

Follow Us