AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాక్టివా స్థానంలో ఎలక్ట్రిక్ స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అతి తక్కువ ధరలో దొరికే బెస్ట్ స్కూటీలు ఇవే..

ఇండియాలో స్కూటీ అనగానే టక్కున గుర్తొచ్చేది హోండా యాక్టివా. దశాబ్దాలుగా మధ్యతరగతి ఫ్యామిలీస్ నమ్మకాన్ని గెలుచుకున్న ఈ బండిని వదిలి.. పెట్రోల్ భారం తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ స్కూటీ వైపు వెళ్లాలనుకుంటున్నారా? అయితే యాక్టివా లాంటి కంఫర్ట్, అదే మెటల్ బాడీ ఉండే బెస్ట్ ఈవీ స్కూటర్ల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

యాక్టివా స్థానంలో ఎలక్ట్రిక్ స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అతి తక్కువ ధరలో దొరికే బెస్ట్ స్కూటీలు ఇవే..
Top 5 Family Electric Scooters To Buy
Krishna S
|

Updated on: Jun 26, 2026 | 12:03 PM

Share

భారత టూ వీలర్ మార్కెట్‌లో హోండా యాక్టివా ఒక సంచలనం అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా నమ్మకానికి, మైలేజీకి, ఫ్యామిలీ కంఫర్ట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా ఇది రికార్డు సృష్టించింది. కొన్నిసార్లు హీరో స్ల్పెండర్ బైక్‌ను కూడా వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటు పెట్రోల్ ధరల భారం తగ్గించుకోవడానికి చాలా మంది యాక్టివా యూజర్లు ఎలక్ట్రిక్ స్కూటర్ వైపు అడుగులు వేస్తున్నారు. ఒక యాక్టివా ఓనర్‌గా మీకు విశాలమైన ఫ్లోర్‌బోర్డ్, మంచి సీటింగ్ కంఫర్ట్, బరువైన బాడీ, సులువైన హ్యాండ్లింగ్ ముఖ్యం. మరి యాక్టివా నుండి ఈవీలోకి మారేటప్పుడు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5 ఆప్షన్లు ఏంటో తెలుసుకుందాం..

ఏథర్ రిజ్తా – పక్కా ఫ్యామిలీ స్కూటర్

సాధారణ పెట్రోల్ స్కూటర్ల నుండి ఈవీలకు సులువుగా మారిపోయేలా ఏథర్ సంస్థ ఈ రిజ్తాను ప్రత్యేకంగా ఫ్యామిలీ సెగ్మెంట్ కోసం డిజైన్ చేసింది. యాక్టివా లాంటి కంఫర్ట్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఈ సెగ్మెంట్‌లోనే అతిపెద్ద సీటు, విశాలమైన ఫ్లోర్‌బోర్డ్, లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రియల్ వరల్డ్ రేంజ్ 123 నుండి 159 కిలోమీటర్ల వరకు వస్తుంది. సీటు కింద భారీ స్టోరేజ్ స్పేస్, ఏథర్ నమ్మకమైన స్మార్ట్ డాష్‌బోర్డ్ దీని సొంతం.

టీవీఎస్ ఐక్యూబ్

మీరు యాక్టివాను ఎలా నడుపుతారో.. సేమ్ అదే సిట్టింగ్ విధానం, బరువు, హ్యాండ్లింగ్ టీవీఎస్ ఐక్యూబ్‌లో ఉంటాయి. యాక్టివా లాగే దీనికి మెటల్ బాడీ పార్ట్స్ వస్తాయి. దీనివల్ల స్కూటర్ చాలా పటిష్టంగా అనిపిస్తుంది. కొత్తగా ఈవీ నడిపే వారికి ఇది చాలా సులభంగా అలవాటైపోతుంది. టాప్ స్పీడ్ 75-82 కిలోమీటర్లు కాగా.. బ్యాటరీ వేరియంట్‌ను బట్టి 94 నుండి 212 కిలోమీటర్ల భారీ రేంజ్ ఇస్తుంది.

బజాజ్ చేతక్

పాత తరం చేతక్ గుర్తులను గుర్తుచేస్తూ.. మోడ్రన్ ఎలిమెంట్స్‌తో వచ్చిన స్కూటర్ ఇది. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ కోరుకునే వారికి ఇది చక్కటి ఆప్షన్. ఆల్-మెటల్ బాడీ, క్లాసిక్ లుక్ దీని ప్రధాన బలం. డైలీ కమ్యూటర్స్ కోసం చాలా రిఫైన్డ్ రైడింగ్‌ను అందిస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై 127 నుండి 153 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

విడా విఎక్స్2

హీరో మోటోకార్ప్ బ్యాకింగ్‌తో వస్తున్న ఈవీ బ్రాండ్ విడా. ఇందులో గో, ప్లస్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో డ్యూయల్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉన్నాయి. సీటింగ్ చాలా విశాలంగా ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రియల్ వరల్డ్ రేంజ్ 92 నుండి 142 కిలోమీటర్ల వరకు వస్తుంది.

ఏథర్ 450ఎక్స్

మీరు ఫ్యామిలీ లుక్ కాకుండా.. కాస్త స్టైలిష్‌గా, స్పోర్టీగా, సిటీ ట్రాఫిక్‌లో దూసుకుపోయే స్కూటర్ కావాలనుకుంటే ఏథర్ 450X బెస్ట్ బెట్. ఇది చాలా లైట్ వెయిట్, పికప్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ బిల్ట్ గూగుల్ మ్యాప్స్ సపోర్ట్‌తో వచ్చే అడ్వాన్స్‌డ్ టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్ దీని హైలైట్. సింగిల్ ఛార్జ్‌పై 126 నుండి 146 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

Follow Us