AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీ మార్ట్‌లో మహిళలకు ఎంతో ఇష్టమైన ఈ ఐటమ్ ఎందుకు ఉండదు? అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెడతారు..

దేశవ్యాప్తంగా సామాన్యుడి నుంచి శ్రీమంతుడి వరకు అందరికీ ఇష్టమైన షాపింగ్ డెస్టినేషన్ డి మార్ట్ . తక్కువ ధరకే కిరాణా సామాగ్రి, నిత్యావసరాలు అందించే డి మార్ట్‌లో కుర్తీలు, టీ-షర్టులు వంటి రెడీమేడ్ దుస్తులన్నీ దొరుకుతాయి గానీ.. చీరలు మాత్రం లభించవు. ఇంత పెద్ద రీటైల్ స్టోర్‌లో చీరలను ఎందుకు అమ్మరు? దీని వెనుక ఉన్న బిజినెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం..

డీ మార్ట్‌లో మహిళలకు ఎంతో ఇష్టమైన ఈ ఐటమ్ ఎందుకు ఉండదు? అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెడతారు..
Why D Mart Does Not Sell Sarees
Krishna S
|

Updated on: Aug 04, 2026 | 10:59 AM

Share

మన దేశంలో నిత్యావసరాలు, కిరాణా సామాగ్రి నుంచి ఇంటికి అవసరమయ్యే ప్రతీ వస్తువు తక్కువ ధరకే లభించే రిటైల్ స్టోర్ చైన్‌లలో డి మార్ట్‌ది స్పెషల్ ప్లేస్. ప్రతి నెలా షాపింగ్ చేసేవారికి డి మార్ట్ మొదటి ఆప్షన్‌గా ఉంటుంది. మహిళల కోసం కుర్తీలు, లెగ్గింగ్‌లు, టీ షర్టులు, ఇతర రెడీమేడ్ దుస్తులు లభించినప్పటికీ.. దాదాపు అన్ని శాఖల్లో చీరలు లభించకపోవడం చాలామందిని ఆశ్చర్యపరిచే విషయం. డి మార్ట్ చీరలను ఎందుకు విక్రయించదో తెలుసా? దీని వెనుక ఒక బలమైన వ్యాపార వ్యూహం ఉంది. డి మార్ట్ విజయ రహస్యం దాని ప్రత్యేకమైన బిజినెస్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. కంపెనీ ప్రధానంగా రోజువారీ జీవితంలో ఎక్కువగా ఉపయోగించే, వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తులపైనే దృష్టి పెడుతుంది. తక్కువ లాభ మార్జిన్‌తో ఎక్కువ మొత్తంలో వస్తువులను విక్రయించడం ద్వారా కస్టమర్లకు భారీ డిస్కౌంట్లను అందించడం డి మార్ట్ సూత్రం.

చీరల వ్యాపారం చాలా విభిన్నం

చీరల విక్రయం ఇతర దుస్తుల వ్యాపారం కంటే పూర్తిగా భిన్నమైనది. చీరల్లో వందల రకాల ఫ్యాబ్రిక్‌లు, విభిన్న డిజైన్లు, ప్యాటర్న్లు, రంగులు, ఎప్పటికప్పుడు మారే ఫ్యాషన్ ట్రెండ్‌లు ఉంటాయి. ఇన్ని రకాల స్టాక్‌ను నిర్వహించాలంటే ఎక్కువ స్థలం, ఎక్కువ పెట్టుబడి, అలాగే నిరంతర స్టాక్ నిర్వహణ అవసరం. చీరలు కుర్తీలు లేదా నిత్యావసరాల లెక్క వేగంగా అమ్ముడవ్వవు. స్టాక్ ఎక్కువ కాలం నిల్వ ఉండిపోతే కంపెనీకి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది.

బిజినెస్ మోడల్‌కు సరిపోని చీరల విభాగం

డి మార్ట్ నమూనా వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తుల పైనే నడుస్తుంది కాబట్టి చీరల వంటి విభాగంలో భారీగా పెట్టుబడి పెట్టడం కంపెనీకి లాభదాయకం కాదు. అందుకే కంపెనీ కేవలం కిరాణా, హోమ్ కేర్, రోజూ అమ్ముడయ్యే రెడీమేడ్ దుస్తులకే ప్రాధాన్యత ఇస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లోని ఎంపిక చేసిన డి మార్ట్‌లలో కస్టమర్ల డిమాండ్‌ను బట్టి పరిమిత సంఖ్యలో చీరలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఎక్కువ డీమార్ట్‌లలో చీరల కోసం ప్రత్యేక విభాగం ఉండదు.

Follow Us
ఇంట్లో టమాటాలు ఉన్నాయా? ఇలా వారానికి మూడుసార్లు చేసినా వద్దనరు..
ఇంట్లో టమాటాలు ఉన్నాయా? ఇలా వారానికి మూడుసార్లు చేసినా వద్దనరు..
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
మీ ఊరు,వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..? తెలుసుకోండిలా
మీ ఊరు,వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..? తెలుసుకోండిలా
ఇంట్లో ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే శుభప్రదం? ఏకముఖం నుంచి..
ఇంట్లో ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే శుభప్రదం? ఏకముఖం నుంచి..
టీమిండియా బ్యాటర్లపై సీరియస్.. గంభీర్‌కు మొదలైన కొత్త టెన్షన్
టీమిండియా బ్యాటర్లపై సీరియస్.. గంభీర్‌కు మొదలైన కొత్త టెన్షన్
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
జబర్దస్త్‌లోకి 'అగ్నిపరీక్ష' రాజకుమారి..ఎవరి టీమ్‌లో చేస్తుందంటే?
జబర్దస్త్‌లోకి 'అగ్నిపరీక్ష' రాజకుమారి..ఎవరి టీమ్‌లో చేస్తుందంటే?
ఇంట్లో అన్నం మిగిలిందా? ఇలా కరకరలాడే వడియాలు తయారు చేసుకోండి!
ఇంట్లో అన్నం మిగిలిందా? ఇలా కరకరలాడే వడియాలు తయారు చేసుకోండి!
ఆ స్టార్ హీరో నాకు దేవుడితో సమానం..
ఆ స్టార్ హీరో నాకు దేవుడితో సమానం..
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో