AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఆకులను లైట్ తీసుకుంటే నిజంగా తింగరోళ్లే.. కిడ్నీలు, లివర్‌ను డిటాక్స్ చేసే మొనగాడు వజ్రాయుధం..

కొత్తిమీర కేవలం వంటల రుచి, సువాసన కోసం మాత్రమే కాదు.. జీర్ణక్రియ మెరుగుపరచడం నుంచి గుండె, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడం వరకు అనేక ప్రయోజనాలను అందించే సహజ ఔషధమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే చర్మ సంరక్షణ, మొటిమలు, బ్లాక్ హెడ్స్, నోటి దుర్వాసన వంటి సమస్యలకు కూడా ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు.

ఈ ఆకులను లైట్ తీసుకుంటే నిజంగా తింగరోళ్లే.. కిడ్నీలు, లివర్‌ను డిటాక్స్ చేసే మొనగాడు వజ్రాయుధం..
Coriander Health Benefits
Shaik Madar Saheb
|

Updated on: Aug 03, 2026 | 12:32 PM

Share

మనం వంటల్లో సాధారణంగా ఉపయోగించే కొత్తిమీర కేవలం రుచి, సువాసన కోసమే కాదు.. ఇది ఎన్నో ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలను అందించే ఒక శక్తివంతమైన సహజ ఔషధం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనిని సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా అనేక సమస్యల నుండి విముక్తి పొందవచ్చని పేర్కొంటున్నారు. కొత్తిమీరలో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది తక్కువ కేలరీలతో పాటు శరీధారానికి అవసరమైన ఖనిజాలను అందిస్తుందని.. దీనిని తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలని పేర్కొంటున్నారు.

కొత్తిమీర ఆరోగ్య ప్రయోజనాలు

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది:

కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనం తీసుకున్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడతాయి. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉత్పత్తిని మెరుగుపరచి, అజీర్తి, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఇది కిడ్నీలు, లివర్‌ను డిటాక్స్ చేయడానికి కూడా దోహదపడుతుంది.

ఋతుక్రమ సమస్యల నుంచి ఉపశమనం:

కొత్తిమీర టీ లేదా ధనియాల కషాయం ఋతుక్రమ సమయంలో వచ్చే క్రాంప్స్, నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇంట్లో ఆడపిల్లలు పీరియడ్స్ నొప్పితో బాధపడుతున్నప్పుడు.. ఈ సహజ చిట్కాను ప్రయత్నించవచ్చని సూచిస్తున్నారు.

ఎముకల ఆరోగ్యానికి వరం:

కొత్తిమీరలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల బలహీనతను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎముకలను గుల్లబారకుండా చేసి, శరీరాన్ని బలంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కాల్షియం కోసం ప్రత్యేకంగా పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. దీనిలోని విటమిన్ K రక్తం గడ్డకట్టడంలో, ఎముకల మరమ్మత్తులో కీలక పాత్ర పోషిస్తుంది.

గుండె ఆరోగ్యానికి రక్షణ:

కొత్తిమీర కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. రక్తనాళాల ఎలాస్టిసిటీని మెయింటైన్ చేయడం ద్వారా వాటిలో బ్లాకేజ్‌లు ఏర్పడకుండా చూస్తుంది. ఇది గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించి, గుండెను పదిలంగా ఉంచడానికి తోడ్పడుతుంది.

యాంటీ ఏజింగ్ – చర్మ సౌందర్యం:

కొత్తిమీరలో ఉండే ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి లోపలి నుంచి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి అవయవాలు దెబ్బతినకుండా చూస్తాయి. బాహ్యంగా, కొత్తిమీర పేస్ట్‌ను కలబంద గుజ్జుతో కలిపి ముఖంపై ముడతలు ఉన్న చోట అప్లై చేసి, 30-40 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగితే చర్మ ముడతలు తగ్గుతాయి.

బ్లాక్ హెడ్స్ – మొటిమలకు పరిష్కారం:

కొత్తిమీర పేస్ట్‌కు కొద్దిగా పసుపు కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల అవి తగ్గుతాయి. ఇది చర్మాన్ని శుభ్రపరిచి, సహజ మెరుపును అందిస్తుంది.

ఇతర ప్రయోజనాలు:

  • జ్వరం నివారణ: కొత్తిమీర జ్యూస్ యాంటీ పైరెటిక్ లాగా పనిచేసి జ్వరం తగ్గించడానికి సహాయపడుతుంది.
  • కళ్ళ ఆరోగ్యం: కొత్తిమీరను క్రమం తప్పకుండా తీసుకోవడం కళ్ళకు మంచిది.
  • నోటి దుర్వాసన: కొత్తిమీరను నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.
  • జిడ్డు చర్మం (Oily Skin): కొత్తిమీర పేస్ట్‌ను పచ్చి పాలతో కలిపి ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేస్తే జిడ్డు చర్మం సమస్య తగ్గుతుంది.
  • పొడి పెదాలు: కొత్తిమీర పేస్ట్‌ను నిమ్మరసంతో కలిపి పెదాలకు అప్లై చేసి మర్దన చేయడం వల్ల పెదాలు ఆరోగ్యంగా, సహజసిద్ధంగా మెరుస్తాయి.

కొత్తిమీరలో ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నందున, దీనిని కేవలం ఫ్లేవరింగ్ ఏజెంట్‌గా కాకుండా, మన ఆరోగ్యం, సౌందర్య సంరక్షణలో ఒక వజ్రాయుధంగా పరిగణించాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, ముందుగా వైద్యులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కిడ్నీలు, లివర్‌ను డిటాక్స్ చేసే మొనగాడు వజ్రాయుధం..
కిడ్నీలు, లివర్‌ను డిటాక్స్ చేసే మొనగాడు వజ్రాయుధం..
చోరీ చేసిన బంగారం, డబ్బు తిరిగి ఇంట్లోకి విసిరేసిన దొంగలు.. కానీ
చోరీ చేసిన బంగారం, డబ్బు తిరిగి ఇంట్లోకి విసిరేసిన దొంగలు.. కానీ
డీ మార్ట్‌లో చీరలు ఎందుకు అమ్మరు? అసలు విషయం తెలిస్తే ..
డీ మార్ట్‌లో చీరలు ఎందుకు అమ్మరు? అసలు విషయం తెలిస్తే ..
ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న లవ్ స్టోరీ..
ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న లవ్ స్టోరీ..
సంవత్సరం పాటు నిల్వ ఉండే ఘుమఘుమలాడే కాలీఫ్లవర్ ఆవకాయ..
సంవత్సరం పాటు నిల్వ ఉండే ఘుమఘుమలాడే కాలీఫ్లవర్ ఆవకాయ..
పొట్టి ఫార్మాట్‌లో దండుపాళ్యం బ్యాచ్.. బ్యాట్ పట్టాలంటేనే వణుకు..
పొట్టి ఫార్మాట్‌లో దండుపాళ్యం బ్యాచ్.. బ్యాట్ పట్టాలంటేనే వణుకు..
ఆర్బీఐ బల్క్ డిపాజిట్ నిబంధనల్లో కీలక మార్పులు.. సర్క్యులర్‌ జారీ
ఆర్బీఐ బల్క్ డిపాజిట్ నిబంధనల్లో కీలక మార్పులు.. సర్క్యులర్‌ జారీ
అన్నదాతల్లో ఆశలు రేపుతున్న ఆగస్టు.. రైతన్నకు వరుణుడి అదిరిపోయే..
అన్నదాతల్లో ఆశలు రేపుతున్న ఆగస్టు.. రైతన్నకు వరుణుడి అదిరిపోయే..
మనసులను కదలించే సినిమా.. సస్పెన్స్, థ్రిల్లర్ కాంబో సంచలనం..
మనసులను కదలించే సినిమా.. సస్పెన్స్, థ్రిల్లర్ కాంబో సంచలనం..
చైనా భీకర AI వార్‌ఫేర్ ప్లాన్.. భారత్ కౌంటర్ వ్యూహం ఇదే..!
చైనా భీకర AI వార్‌ఫేర్ ప్లాన్.. భారత్ కౌంటర్ వ్యూహం ఇదే..!