AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ.. విషాదాంతం! ఏం జరిగిందంటే..

ప్రియుడి మోజులో పడి కన్న తల్లిదండ్రులనే హత్య చేసిన నర్సు సురేఖ జీవితం విషాదాంతమైంది. గతంలో తల్లిదండ్రులకు విషపు సూది మందు ఇచ్చి దారుణంగా హత్య చేసింది. ఈ కేసులో జైలుకు వెళ్లిన ఆమె ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చి హాస్టల్‌లో నివసిస్తోంది. కన్నవారి ప్రాణాలు తీసిన విధానంలోనే తను కూడా సూది మందు ద్వారా జీవితాన్ని ముగించుకోవడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సంగారెడ్డి పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..

తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ.. విషాదాంతం! ఏం జరిగిందంటే..
Nurse Surekha
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Aug 24, 2026 | 8:25 AM

Share

ప్రేమ, నమ్మకం.. చివరకు కన్నవారినే దూరం చేసిన ఓ యువతి జీవితం విషాదాంతమైంది. ప్రియుడి మోజులో పడి కన్న తల్లిదండ్రులకు సూది మందు ద్వారా విషమిచ్చి హత్య చేసిన నర్సు సురేఖ.. అదే సూది మందు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన సురేఖ నర్సుగా పనిచేసేది. గతంలో తన తల్లిదండ్రులకు విషం కలిపిన సూది మందు ఇచ్చి హత్య చేసిన కేసులో ఆమె జైలుకు వెళ్లింది. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన సురేఖ.. అప్పటి నుంచి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటోంది.

అయితే, తాజాగా హాస్టల్‌లో సురేఖ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రుల ప్రాణాలు తీసిన అదే విధానంలో ఆమె తన జీవితాన్ని కూడా ముగించుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇవి కూడా చదవండి

సురేఖ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని సంగారెడ్డి పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఆత్మహత్యకు అసలు కారణాలు ఏమిటి? జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన తర్వాత ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

తల్లిదండ్రుల హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి.. ఇటీవలే బయటకు వచ్చిన సురేఖ ఇలా తన జీవితాన్ని కూడా అర్ధంతరంగా ముగించుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సురేఖ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
కేవలం రూ.200కే 30GB డేటా, 20కిపైగా OTTలు, యూట్యూబ్‌ ప్రీమియం..!
కేవలం రూ.200కే 30GB డేటా, 20కిపైగా OTTలు, యూట్యూబ్‌ ప్రీమియం..!
కార్తీక పౌర్ణమి ఎప్పుడు? దాని గురించి తెలుసుకుందాం!
కార్తీక పౌర్ణమి ఎప్పుడు? దాని గురించి తెలుసుకుందాం!
ముఖానికి ఆవిరి పడుతున్నారా? అసలు నిజాలేంటో డర్మటాలజిస్ట్ మాటల్లో
ముఖానికి ఆవిరి పడుతున్నారా? అసలు నిజాలేంటో డర్మటాలజిస్ట్ మాటల్లో
బాలీవుడ్‌లో ఎంతో మంది నటులకు అన్యాయం..
బాలీవుడ్‌లో ఎంతో మంది నటులకు అన్యాయం..
ఏపీలో భారీ పేలుడు.. నలుగురు మృతి.. అసలేం జరిగింది?
ఏపీలో భారీ పేలుడు.. నలుగురు మృతి.. అసలేం జరిగింది?
ఏకాంతంగా ముగ్గురం కలిసి ఎంజాయ్ చేద్దాం.. అంటూ భర్తను తీసుకెళ్లి..
ఏకాంతంగా ముగ్గురం కలిసి ఎంజాయ్ చేద్దాం.. అంటూ భర్తను తీసుకెళ్లి..
అర్థరాత్రి మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే..
అర్థరాత్రి మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే..
కలలో చంద్రుడు కనిపిస్తే శుభమా? పౌర్ణమి, అర్ధచంద్రుడు కనిపిస్తే..
కలలో చంద్రుడు కనిపిస్తే శుభమా? పౌర్ణమి, అర్ధచంద్రుడు కనిపిస్తే..
మేడిన్ ఇండియా స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయి..!
మేడిన్ ఇండియా స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయి..!
ఈ బెర్రీ పండ్ల‌ను అంత త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కండి.. వీటితో క‌లిగే
ఈ బెర్రీ పండ్ల‌ను అంత త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కండి.. వీటితో క‌లిగే