AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీర్ గ్లాస్‌లో పల్లీలు వేస్తే మునగవు.. తేలవు.. ఎందుకో తెలుసా? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే!

బీర్ తాగేటప్పుడు నట్స్ లేదా పల్లీలను నంచుకోవడం చాలామందికి అలవాటు. అయితే, బీర్ గ్లాస్‌లో కొన్ని వేరుశెనగ గుళ్లను వేస్తే అవి గ్లాస్ అడుగున స్థిరంగా ఉండకుండా పైకీ కిందకీ తేలుతూ కదులుతుంటాయి. దీనిని డాన్సింగ్ పీనట్స్ అని పిలుస్తారు. ఇది ఏదో మాయాజాలం అనుకుంటే పొరపాటే, దీని వెనుక పూర్తి శాస్త్రీయ కారణం ఉంది. జర్మనీలోని లుడ్విగ్ మాక్సిమిలియన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కూడా ఈ ఆసక్తికరమైన అంశంపై పరిశోధన చేసి కీలక విషయాలను వెల్లడించారు.

బీర్ గ్లాస్‌లో పల్లీలు వేస్తే మునగవు.. తేలవు.. ఎందుకో తెలుసా? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే!
Peanuts In Beer
Jyothi Gadda
|

Updated on: Aug 23, 2026 | 1:59 PM

Share

మీరు ఎప్పుడైనా బీరు గ్లాసులో వేరుశెనగ గింజను వేయడం చూశారా? ఒకవేళ చూసి ఉంటే, మీరు ఒక వింత విషయాన్ని గమనించి ఉంటారు. బీరులో వేరుశెనగ గింజను వేయగానే, అది మొదట మునిగిపోతుంది. కానీ, కొద్దిసేపటి తర్వాత అకస్మాత్తుగా పైకి తేలడం మొదలవుతుంది. పైకి చేరిన తర్వాత, అది మళ్ళీ మునిగిపోతుంది. కానీ, కొద్దిసేపటికే తిరిగి పైకి వస్తుంది. ఇది పదేపదే జరుగుతూ ఉంటుంది. ఆ వేరుశెనగ గ్లాసులో నాట్యం చేస్తున్నట్లుగా. ఇది మాయాజాలం లేదా బీరు అద్భుతం కాదు, దీని వెనుక ఒక పెద్ద శాస్త్రం ఉంది. శాస్త్రవేత్తలు ఈ ఆసక్తికరమైన దృగ్విషయంపై పరిశోధనలు కూడా నిర్వహించారు.

మొదట పల్లీలు అడుగుకు ఎందుకు వెళ్తాయి?

బీర్‌లో పల్లీలు వేయగానే అవి మొదట గ్లాస్ అడుగుభాగంలోకి మునిగిపోతాయి. దానికి కారణం ద్రవరూపంలో ఉండే బీర్ సాంద్రత కంటే పొట్టు తీసిన, వేగించిన పల్లీల సాంద్రత ఎక్కువగా ఉండటమే. బీర్ కంటే బరువు ఎక్కువ కావడం వల్ల గురుత్వాకర్షణ ప్రభావంతో పల్లీలు కిందకు చేరుకుంటాయి.

బుడగల మ్యాజిక్:

బీర్‌లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ విరివిగా కరిగి ఉంటుంది. బీర్‌ను గ్లాస్‌లోకి వంపినప్పుడు ఈ గ్యాస్ బయటకు రావడం ప్రారంభిస్తుంది. పల్లీల ఉపరితలం చాలా గరుకుగా, చిన్న చిన్న రంధ్రాలతో ఉంటుంది. ఇది వాయు బుడగలు ఏర్పడటానికి ఒక స్థావరంగా ఉపయోగపడుతుంది. బీర్ గ్లాస్ గోడల కంటే పల్లీల పైనే ఈ కార్బన్ డైఆక్సైడ్ బుడగలు త్వరగా చుట్టుముడతాయి.

ఇవి కూడా చదవండి

పల్లీలు పైకి ఎలా తేలుతాయి?:

పల్లీ చుట్టూ వందలాది చిన్న చిన్న CO2 బుడగలు అంటుకోవడం వల్ల పల్లీల మొత్తం బరువు బీర్ కంటే తేలికగా మారిపోతుంది. ఈ బుడగలు ఒక చిన్న లైఫ్ జాకెట్ లేదా తేలియాడే పరికరంలా పనిచేసి, పల్లీని మెల్లగా గ్లాస్ పైభాగానికి తీసుకెళ్తాయి.

మళ్లీ కిందకు ఎందుకు మునుగుతాయి?:

పల్లీలు బీర్ ఉపరితలానికి చేరుకోగానే, గాలితాకిడికి పల్లీకి ఉన్న CO2 బుడగలు పేలిపోతాయి. దాంతో పల్లీకి ఉన్న అదనపు తేలికదనం పోయి, మళ్లీ బరువుగా మారి అడుగుకి మునిగిపోతుంది. కిందకు వెళ్ళగానే మళ్లీ కొత్త బుడగలు అంటుకోవడం, పైకి రావడం జరుగుతుంది.

బీర్‌లో కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఉన్నంతవరకు పల్లీల ఈ డాన్స్ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. శాస్త్రవేత్తల ప్రకారం, ఈ సహజ సిద్ధమైన ప్రక్రియను పరిశ్రమలలో మైనింగ్, అగ్నిపర్వతాల అధ్యయనంలో కూడా అవగాహన కోసం ఉపయోగిస్తారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us