AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకాశమంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భూగర్భంలో ఎంత లోతులో ఉందో తెలుసా..?

దుబాయ్‌లో ఉన్న బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా గిన్నిస్ రికార్డు సాధించింది. 828 మీటర్ల ఎత్తు, 163 అంతస్తులతో నిర్మితమైన ఈ భవనం ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపిస్తుంది. అయితే, అంతటి భారీ భవనం గాలి దుమారాలు, భూకంపాలను తట్టుకుని నిలబడటానికి దాని పునాది ఎంత బలంగా నిర్మించారో తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరం. ఆకాశమంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భూగర్భంలో ఎంత లోతులో ఉందో ఇప్పుడు చూద్దాం..

ఆకాశమంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భూగర్భంలో ఎంత లోతులో ఉందో తెలుసా..?
Burj Khalifa Foundation
Jyothi Gadda
|

Updated on: Aug 23, 2026 | 12:47 PM

Share

ప్రపంచంలోనే అతిపెద్ద కట్టడమైన బుర్జ్ ఖలీఫా ఎత్తు 828 మీటర్లు అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే, దీని భద్రత వెనుక బలమైన పునాది ఉంది. ఇంజనీర్లు బుర్జ్ ఖలీఫా నిర్మాణానికి పైల్డ్ రాఫ్ట్ ఫౌండేషన్ అనే ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించారు. భవనం కింద దాదాపు 3.7 మీటర్ల మందంతో చాలా భారీ కాంక్రీట్ రాఫ్ట్ నిర్మించారు. ఈ రాఫ్ట్ కింద దాదాపు 192 బలమైన కాంక్రీట్ స్తంభాలు నేలలోకి దింపబడ్డాయి. ప్రతీ పైల్ డయామీటర్ మందం దాదాపు 1.5 మీటర్లు ఉంటుంది.

పునాది ఎంత లోతుకు వెళ్ళింది?:

అధికారిక, సాంకేతిక నివేదికల ప్రకారం ఈ కాంక్రీట్ పైల్స్ భూమి లోపలికి దాదాపు 45 నుండి 50 మీటర్లు సుమారు 164 అడుగులు లోతు వరకు పాతుకుపోయాయి. సాధారణంగా ఒక్కో అంతస్తు ఎత్తు 3 మీటర్లు అనుకుంటే, 45-50 మీటర్లు అంటే దాదాపు ఒక 15 అంతస్తుల భవనమంత లోతుకు సమానం. అంటే భూమిపైన 828 మీటర్ల భవనం ఉంటే, దాని కింద 15 అంతస్తుల లోతైన పునాది అండగా నిలిచింది.

ఇసుక నేలలో అంత బలం ఎలా?:

దుబాయ్ భూభాగం ప్రధానంగా బలహీనమైన ఇసుక, ఇసుకరాయితో కూడుకుని ఉంటుంది. ఇంజనీర్లు దాదాపు 140 మీటర్ల లోతు వరకు భూమి పొరలను పరిశీలించారు. ఇక్కడ ఎలాంటి గట్టి రాతి పొరలు లేకపోవడంతో ఫ్రిక్షన్ పైల్స్ సాంకేతికతను వాడారు. అంటే, పైల్స్‌కు, దాని చుట్టూ ఉండే నేలకు మధ్య ఉండే రాపిడి వల్ల భవనం కిందకు కుంగిపోకుండా స్థిరంగా నిలబడుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ పునాది నిర్మాణం కోసం 45,000 క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ కాంక్రీట్‌ను ఉపయోగించారు. దీని బరువు దాదాపు లక్ష టన్నులకు పైగా ఉంటుంది. దుబాయ్ భూగర్భ జలాల వల్ల కాంక్రీట్ దెబ్బతినకుండా ప్రత్యేక కోటింగ్స్, నిరోధక సాంకేతికతలను ఉపయోగించారు. ఇంజనీరింగ్ అద్భుతమైన బుర్జ్ ఖలీఫా దృఢత్వానికి ఈ నిగూఢమైన పునాదే అసలైన రహస్యం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us