AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha OTT: ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న లవ్ స్టోరీ.. మూడు రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్‏తో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్..

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే ప్రేమకథ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓ యూత్ ఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ సినిమా సంచలన రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. తాజాగా ఈ మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే 50 మిలియన్ మినట్స్ వ్యూస్ అందుకుంది.

Aha OTT: ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న లవ్ స్టోరీ.. మూడు రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్‏తో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్..
Deewana
Rajitha Chanti
|

Updated on: Aug 03, 2026 | 12:31 PM

Share

గత కొన్నాళ్లుగా ఓటీటీలలో వైవిధ్యమైన, హృదయానికి హత్తుకునే కథా చిత్రాలు దూసుకుపోతున్నాయి. మనసులలో నిలిచిపోయే సినిమాలకు డిజిటల్ మూవీ లవర్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో విడుదలైన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘దీవానా’ (Deewana)కి మంచి రెస్పాన్స్ వస్తుంది. జూలై 31న అధికారికంగా స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు డిజిటల్ స్పేస్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని, ఒక సరికొత్త రికార్డును నెలకొల్పింది.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

ఇదిలా ఉంటే దీవానా సినిమా ఆహాలో క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ గురించి మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఆహాలో ఏకంగా 50 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేసి, 2026 నాటి బిగ్గెస్ట్ సూపర్‌హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమాకు రెండు భాషల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాయకా నాయికల మధ్య కెమిస్ట్రీ, ఆకట్టుకునే సంభాషణలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా నేటితరం ప్రేమకథల్లో ఉండే భావోద్వేగాలను, ఎదురయ్యే సంఘర్షణలను దర్శకుడు ఎంతో సహజంగా, అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చారు. ప్రేమలోని మధురానుభూతులను చక్కగా ఆవిష్కరించడంతో యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతున్నారు.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

ఈ సినిమాలో యంగ్ స్టర్స్ హర్షిత్ రెడ్డి, స్నేహా మణిమేఘలై ప్రధాన పాత్రలలో నటించారు. బాధ్యతలేని ఒక యువకుడిగా ఉన్న మున్నా (హర్షిత్ రెడ్డి) అదే సమయంలో ప్రభుత్వం ఉద్యోగి అయిన అమూల్య (స్నేహ)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ ప్రేమ మున్నా జీవితాన్ని ఎలా మార్చేసింది అనేది ఈ మూవీ. ప్రస్తుతం ఈ చిత్రానికి కుర్రాళ్లు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

ఆహా ట్వీట్..

https://twitter.com/ahavideoIN/status/2084146080762241456

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Follow Us
ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న లవ్ స్టోరీ..
ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న లవ్ స్టోరీ..
సంవత్సరం పాటు నిల్వ ఉండే ఘుమఘుమలాడే కాలీఫ్లవర్ ఆవకాయ..
సంవత్సరం పాటు నిల్వ ఉండే ఘుమఘుమలాడే కాలీఫ్లవర్ ఆవకాయ..
పొట్టి ఫార్మాట్‌లో దండుపాళ్యం బ్యాచ్.. బ్యాట్ పట్టాలంటేనే వణుకు..
పొట్టి ఫార్మాట్‌లో దండుపాళ్యం బ్యాచ్.. బ్యాట్ పట్టాలంటేనే వణుకు..
ఆర్బీఐ బల్క్ డిపాజిట్ నిబంధనల్లో కీలక మార్పులు.. సర్క్యులర్‌ జారీ
ఆర్బీఐ బల్క్ డిపాజిట్ నిబంధనల్లో కీలక మార్పులు.. సర్క్యులర్‌ జారీ
అన్నదాతల్లో ఆశలు రేపుతున్న ఆగస్టు.. రైతన్నకు వరుణుడి అదిరిపోయే..
అన్నదాతల్లో ఆశలు రేపుతున్న ఆగస్టు.. రైతన్నకు వరుణుడి అదిరిపోయే..
మనసులను కదలించే సినిమా.. సస్పెన్స్, థ్రిల్లర్ కాంబో సంచలనం..
మనసులను కదలించే సినిమా.. సస్పెన్స్, థ్రిల్లర్ కాంబో సంచలనం..
చైనా భీకర AI వార్‌ఫేర్ ప్లాన్.. భారత్ కౌంటర్ వ్యూహం ఇదే..!
చైనా భీకర AI వార్‌ఫేర్ ప్లాన్.. భారత్ కౌంటర్ వ్యూహం ఇదే..!
పుల్ షాట్‌తోనే పిచ్చెక్కిస్తారయ్యో.. ఫస్ట్ పేరు చూస్తే పూనకాలే..!
పుల్ షాట్‌తోనే పిచ్చెక్కిస్తారయ్యో.. ఫస్ట్ పేరు చూస్తే పూనకాలే..!
కుతుబ్‌షాహీల నుంచి తెలంగాణ వరకు.. కాలంతో పాటు ఎదిగిన మహానగరం
కుతుబ్‌షాహీల నుంచి తెలంగాణ వరకు.. కాలంతో పాటు ఎదిగిన మహానగరం
బ్రిజ్ భూషణ్‌కు బిగ్ రిలీఫ్.. లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా..
బ్రిజ్ భూషణ్‌కు బిగ్ రిలీఫ్.. లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా..