AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం మత్తులో తూగుతూ వచ్చిన పెళ్లికొడుకు.. చెంప ఛెళ్లుమనిపించిన వధువు!

చివరి నిమిషంలో ఓ యువతి ధైర్యంగా తీసుకున్న నిర్ణయం ఆమె నూరేళ్ల జీవితాన్ని కాపాడింది. అంతేనా ఆమె ధైర్యసాహసాలు అందరి ప్రశంసలు అందుకుంటోంది. పెళ్లి మండపానికి మద్యం మత్తులో వచ్చిన పెళ్లికొడుకును చూసి చిర్రెత్తుకొచ్చిన వధువు.. చాచిపెట్టి కొట్టింది. అంతే పెళ్లి రద్దు. వివాహానికి నిరాకరించి వరుడికి బుద్ధి చెప్పిన సదరు 22 ఏళ్ల యువతి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ విచిత్రి సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గీర్-చంపా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

మద్యం మత్తులో తూగుతూ వచ్చిన పెళ్లికొడుకు.. చెంప ఛెళ్లుమనిపించిన వధువు!
Bride Slaps Drunk Groom
Srilakshmi C
|

Updated on: Jun 26, 2026 | 12:18 PM

Share

జంజ్‌గిర్, జూన్‌ 26: ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గీర్-చంపా జిల్లా కోస్మాండా గ్రామానికి చెందిన ముస్కాన్ ప్రధాన్ (22)కు ఖోఖ్రా గ్రామానికి చెందిన సంత్ రామ్ (24)తో జూన్ 23న వివాహం నిశ్చయమైంది. నిర్ణీత సమయానికి పెళ్లి బృందం వధువు ఇంటికి చేరుకుంది. వివాహ కార్యక్రమాలు ప్రారంభమైన కొద్దిసేపటికే పెళ్లికొడుకు ఫూటుగా మద్యం సేవించి మత్తులో పెళ్లి మండపానికి చేరుకున్నాడు. కనీసం సరిగా నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు. దీంతో మండపంలోని వధువు ముస్కాన్ వరుడి చెంప చెళ్లుమనిపించింది. తాగుబోతును వివాహం చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో పెళ్లి రద్దు అయింది. నిశ్చితార్థం సమయంలో కూడా పెళ్లికొడుకు మద్యం సేవించి వచ్చినట్లు ముస్కాన్ పోలీసులకు తెలిపింది. అప్పుడే అతడిని హెచ్చరించగా, ఇకపై మద్యం తాగనని హామీ ఇచ్చాడని పేర్కొంది. అయితే పెళ్లి రోజే మళ్లీ మద్యం మత్తులో రావడంతో తన నిర్ణయాన్ని మార్చుకోలేదని చెప్పింది.

వధువు నిర్ణయంతో పెళ్లి వేదిక వద్ద ఇరు కుటుంబాల సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో రెండు వర్గాల యువకుల మధ్య ఘర్షణ జరగగా కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పెళ్లి ఏర్పాట్ల కోసం చేసిన ఖర్చులను దృష్టిలో ఉంచుకుని వధువు కుటుంబానికి సుమారు రూ.3 లక్షల పరిహారం చెల్లించేందుకు వరుడి కుటుంబం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. పదో తరగతి వరకు చదివిన ముస్కాన్ ప్రస్తుతం తన చదువును కొనసాగించాలని భావిస్తుంది. మద్యం వ్యసనానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడినందుకు జంజ్‌గీర్-చంపా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌ ఆమెను సామాజిక కార్యకర్తలు, మహిళా ప్రతినిధుల సమక్షంలో సత్కరించారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. మద్యం వ్యసనం, బాధ్యతారాహిత్యాన్ని పెళ్లిళ్లలో నిర్లక్ష్యం చేయకూడదనే సందేశాన్ని ఈ ఘటన సమాజానికి ఇచ్చిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ముస్కాన్ తీసుకున్న నిర్ణయం అనేక కుటుంబాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు.

Follow Us
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
బొల్లారం చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్
బొల్లారం చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్
సముద్ర చిలుకకు ప్రాణం పోసిన అధికారులు.
సముద్ర చిలుకకు ప్రాణం పోసిన అధికారులు.