AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్లగా ఉంది పైగా మెల్ల ఆమె హీరోయిన్ ఏంటి..? అన్నారు.. కట్ చేస్తే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. తమ మార్క్ తో ప్రేక్షకులను అలరించిన వారిలో దర్శకుడు వంశీ ఒకరు. ఎన్నో సూపర్ హిట్స్ అందించి ప్రేక్షకులను మెప్పించారు వంశీ. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు వంశీ. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

నల్లగా ఉంది పైగా మెల్ల ఆమె హీరోయిన్ ఏంటి..? అన్నారు.. కట్ చేస్తే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది
Vamshi
Rajeev Rayala
|

Updated on: Apr 02, 2026 | 11:54 AM

Share

దర్శకుడు వంశీ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సినిమాలు తగ్గించారు వంశీ. అలాగే వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఓ హీరోయిన్ గురించి, ఆమెతో తన సినీ ప్రయాణం గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన దృష్టిలో ఆమె అత్యంత అందమైన నటి అని వంశీ స్పష్టం అన్నారు. ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేయడంలో ఎదురైన సవాళ్లను ఆయన వివరించారు. ఆ హీరోయిన్ ను ఎంపిక చేసిన సమయం చాలా మంది ఆమెను ఎందుకు హీరోయిన్ గా తీసుకున్నారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు వంశీ. ఆమె ఎవరో కాదు అలనాటి అందాల తార భాను ప్రియా.

ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి

భానుప్రియ రంగు కొద్దిగా తక్కువగా ఉండటం వల్ల ఆమెను హీరోయిన్‌గా పెట్టడానికి కెమెరామెన్‌లు, నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేశారని వంశీ తెలిపారు. కానీ తన దృష్టిలో ఆమె అత్యంత అందమైన హీరోయిన్ అని అన్నారు. కొందరు తెల్లగులాబీలు చిత్రానికి కల్పన (ఇళవరసి)ను సూచించగా, మరికొందరు శంకరాభరణం తీసిన కంపెనీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని, అలాగే “నల్లటి మేడు గుడ్లు” అంటూ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే, వంశీ మాత్రం భానుప్రియనే తన హీరోయిన్‌గా ఉండాలని పట్టుబట్టారట. ఈ విషయంలో కె. విశ్వనాథ్ గారి పాత్ర కీలకమని వంశీ పేర్కొన్నారు. 7 స్టార్స్ కలర్ ల్యాబ్‌లో తీసిన భానుప్రియ స్టిల్స్‌ను నిర్మాత గారి ఇంట్లో పెట్టగా, అక్కడికి వచ్చిన విశ్వనాథ్ గారు ఆ ఫోటోలు చూసి బాగుందని అనడంతో అందరూ థ్రిల్ అయ్యారని, ఆమెకు కొంచెం మెల్ల ఉన్నా అది అదృష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారని వంశీ తెలిపారు.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

సీతార సినిమా తర్వాత భానుప్రియ బిజీ అయ్యారని, అయితే తనకు మోడ్రన్ డ్రెస్సులతో కూడిన పాత్రలు రావడం లేదని ఆమె చెప్పడంతో, వంశీ అన్వేషణ సినిమాలో ఆమెను మోడ్రన్ డ్రెస్సులతో చూపించాననివెల్లడించారు. ఆ తర్వాత ప్రేమించి పెళ్ళాడా సినిమాలో చీరకట్టుతో, పెద్ద బొట్టుతో చూపించి ఆమెను ట్రెండ్ సెట్టర్‌గా నిలబెట్టా అని తెలిపారు. ఆలాపన తన దర్శకత్వంలో భానుప్రియతో చేసిన చివరి చిత్రం అని వంశీ పేర్కొన్నారు. భానుప్రియ నృత్యం గురించి మాట్లాడుతూ, ఆమెది ఫోర్స్ అయితే, ఆమె సోదరి శాంతిప్రియది గ్రేస్ అని వివరించారు. ప్రముఖ నటి శోభన కూడా భానుప్రియ నృత్యాన్ని ప్రశంసించారని ఆయన తెలిపారు. భానుప్రియతో చేయాలనుకున్న గాలికొండపురం రైల్వే గేట్ అనే సినిమా ఆగిపోవడానికి గల కారణాలను వంశీ వివరించారు. ఈ చిత్రంలో వెంకటేష్‌ను హీరోగా అనుకోగా, వేమూరి సత్యనారాయణ గారు కథ చెప్పగా, వెంకటేష్ తండ్రి రామానాయుడు గారు, ఇది కమర్షియల్ హీరోగా తన కొడుకుకు సరిపోదని, హీరోయిన్‌కు పేరు తెచ్చే “హిచ్‌కాక్ సినిమా” లా ఉందని భావించి, అభ్యంతరం చెప్పడంతో ఆ సినిమా ఆగిపోయిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇండియన్స్ లేని విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తా.. ఓపెన్‌గా చెప్పిన వేణు స్వామి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us