AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. కేవలం 72 గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు.. నో వెయిటింగ్..

ఈపీఎఫ్ఓ కీలక నిర్ఱయం తీసుకుంది. ఆటో సెటిల్మెంట్ విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఖాతాదారులు వేగంగా క్లెయిమ్స్ పొందవచ్చు .కేవలం 72 గంటల్లోనే డబ్బులు పొందవచ్చు. అర్హులైనవారికి ఈ ప్రయోజనం కల్పిస్తారు. రూ.5లక్షల్లోపు క్లెయిమ్స్ ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేయబడతాయి. ఈ మేరకు ఈపీఎఫ్ఓ క్లెయిమ్స్ వేగవంతం చేసింది.

EPFO: ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. కేవలం 72 గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు.. నో వెయిటింగ్..
Epfo
Venkatrao Lella
|

Updated on: Jul 03, 2026 | 8:30 PM

Share

ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త. ఇక నుంచి మూడు రోజుల్లోనే పీఎఫ్ క్లెయిమ్స్ సెటిల్ కానున్నాయి. ఈ మేరకు ఆటో సెటిల్మెంట్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది ఈపీఎఫ్ఓ. ఈ కొత్త విధానం ద్వారా అర్హులైన పీఎఫ్ ఖాతాదారులు మూడు రోజుల్లోగా క్లెయిమ్స్ పొందవచ్చు. క్లెయిమ్స్ కోసం దరఖాస్తు చేసుకోగానే.. 72 గంటల్లో అకౌంట్లో పడతాయి. గతంలో మాన్యువల్ వెరిఫికేషన్, విధానపరమైన జాప్యాల వల్ల క్లెయిమ్స్ ప్రాసెస్ అవ్వడానికి చాలా సమయం పట్టేంది. కానీ ఇప్పుడు కేవలం మూడు రోజుల్లోనే క్లియర్ కానున్నాయి. కేవైసీ వివరాలు సరిగ్గా ఉండి అన్ని షరతులు పాటిస్తే కేలం మూడు రోజుల్లో పీఎఫ్ సొమ్ము మీ ఖాతాలోకి చేరుతుంది.

12 శాతం జరిమానా

సకాలంలో ప్రాసెసింగ్ జరిగేలా చూసేందుకు 20 రోజుల నిబంధనల విధించారు. అప్పటికీ పూర్తి కాకపోతే బాధ్యులైన అధికారులకు 12 శాతం జరిమానా విధిస్తారు. ఈ నిబంధన జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం, క్లెయిమ్‌లు నిర్దేశిత కాలపరిమితిలోగా ప్రాసెస్ అయ్యేలా చూడటానికి సహాయపడుతుంది. అలాగే ఆటో సెటిల్మెంట్ పరిమితిని ఈపీఎఫ్ఓ పెంచింది. గతంలో రూ.లక్షలోపు ఉన్న పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. రూ.5లక్షల్లోపు క్లెయిమ్స్ ఆటో సెటిల్మెంట్ విధానంలో ప్రాసెస్ చేస్తారు. మాన్యువల్ వెరిఫికేషన్ అనేది ఉండదు. దీని వల్ల ముందస్తు విత్ డ్రాలు ఆటోమేటిక్‌గా ప్రాపెస్ చేస్తారు. ఫిజికల్ డాక్యుమెంట్స్ పని లేకపోవడంతో వేగంగా ఖాతాదారులకు డబ్బులు అందుతాయి. వేగంగా క్లెయిమ్స్ ప్రాసెస్ చేయడం వల్ల వైద్య అత్యవసర పరిస్థితి, విద్య, వివాహం, గృహవసతి, నిరుద్యోగం వంటి విషయాల్లో వేగంగా నగదు పొందవచ్చు. ఇక UAN నెంబర్‌తో ఆధార్ లింక్ చేసినవారు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్డేట్ చేయడ, కేవైసీ పూర్తి చేసినవారికి మరింత వేగంగా క్లెయిమ్స్ అందుతాయి.

ఖాతాదారులు ఏం చేయాలి..?

-యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివ్‌గా ఉండాలి

-ఆధార్‌ను యూఏఎన్‌కు అనుసంధానించాలి

-పాన్, బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌డేట్ చేయాలి

-కేవైసీ పూర్తి చేసి ఉండాలి

-OTP కోసం మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి

Follow Us