AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Hacks: రాత్రి వేళల్లో లైట్ వేస్తే పురుగులు ముసురుతున్నాయా? ఈ 3 టిప్స్‌తో వాటికి చెక్ పెట్టండిలా!

వర్షాకాలం ప్రారంభం కాగానే వాతావరణం చల్లబడటంతో పాటు ఇంట్లో మరొక పెద్ద సమస్య మొదలవుతుంది. రాత్రిపూట ఇంట్లో లైట్లు వేసిన వెంటనే ఎక్కడి నుండి వస్తాయో తెలియదు కానీ చిన్న చిన్న రెక్కల పురుగులు, కీటకాలు వెలుతురు చుట్టూ గుంపులు గుంపులుగా చేరిపోతాయి. ఇవి రాత్రంతా ఇల్లంతా తిరుగుతూ తీవ్రంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా, ఉదయానికల్లా లైట్ల కిందే చనిపోతాయి. దీనివల్ల ఇల్లంతా అపరిశుభ్రంగా మారి క్లీన్ చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. రాత్రిపూట లైట్ల కాంతికి ఆకర్షితమయ్యే ఈ కీటకాల సమస్య నుండి శాశ్వతంగా బయటపడటానికి సహాయపడే 3 అత్యంత ప్రభావవంతమైన చిట్కాల గురించి తెలుసుకుందాం.

Monsoon Hacks: రాత్రి వేళల్లో లైట్ వేస్తే పురుగులు ముసురుతున్నాయా? ఈ 3 టిప్స్‌తో వాటికి చెక్ పెట్టండిలా!
How To Stop Insects From Coming To Light Bulbs
Bhavani
|

Updated on: Jul 03, 2026 | 8:13 PM

Share

తెల్లని వెలుతురు అనేక రకాల ఎగిరే కీటకాలను చాలా వేగంగా ఆకర్షిస్తుంది. వర్షాలు పడే రోజుల్లో భూమి లోపలి నుండి బయటకు వచ్చే ఈ పురుగులు ఇంట్లోని లైట్ల వద్దకు చేరుకుంటాయి. అయితే కొన్ని సులభమైన, ఖర్చు లేని వంటగది , ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఈ కీటకాల ఉనికిని ఇంట్లో పూర్తిగా తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

1. కిటికీలు, తలుపులకు మెష్ గ్రిల్స్ (వలలు) అమర్చడం ఇంట్లోకి కీటకాలు ప్రవేశించకుండా నిరోధించడానికి అన్నింటికంటే సులభమైన , అత్యుత్తమమైన మార్గం కిటికీలు, తలుపులకు మంచి నాణ్యత గల దోమల వలలను అమర్చడం. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో (సంధ్యా సమయంలో) పురుగులు బయటకు రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైమ్‌లో తలుపులు, కిటికీలను పూర్తిగా మూసి ఉంచాలి. ఒకవేళ గాలి కోసం తెరవాలనుకుంటే వల ఉన్న నెట్ డోర్లను మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ మీ ఇంటి కిటికీల వలలు ఎక్కడైనా చిరిగిపోయి ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే వాటిని బాగు చేయించడం మంచిది. దీనివల్ల ఇంట్లో లైట్లు వెలిగి ఉన్నప్పటికీ బయటి నుండి కీటకాలు లోపలికి రాలేవు.

2. సరైన లైటింగ్ మార్చడం…. కంటికి మిరమిట్లు గొలిపే ప్రకాశవంతమైన తెల్లని ట్యూబ్ లైట్లు లేదా ఎల్‌ఈడీ బల్బుల వెలుతురుకు కీటకాలు విపరీతంగా ఆకర్షితమవుతాయి. కాబట్టి వర్షాకాలంలో వీటికి బదులుగా ఇంట్లో వెచ్చని పసుపు రంగు కాంతిని ఇచ్చే వార్మ్ వైట్ ఎల్‌ఈడీ  బల్బులను లేదా ఎల్లో లైట్లను ఉపయోగించడం చాలా మంచిది. పసుపు రంగు తక్కువ వోల్టేజ్ కాంతికి కీటకాలు చాలా తక్కువగా ఆకర్షితమవుతాయి. దీంతో పాటు, రాత్రిపూట ఇంటి లోపలి వెలుతురు బయటకు పరావర్తనం చెందకుండా ఉండటానికి కిటికీలకు మందపాటి కర్టెన్లు (తెరలు) వేయాలి. ఇలా చేయడం వల్ల బయట తిరిగే పురుగులు లోపలి కాంతిని చూడలేక దూరంగా వెళ్ళిపోతాయి.

3. ఇంటి పరిసరాల పరిశుభ్రత… మీ ఇంటి బయట లేదా బాల్కనీలలో నిలిచి ఉన్న పాత నీరు, కుళ్ళిన తడి ఆకులు, చెత్తాచెదారం , దట్టమైన పొదలు కీటకాలకు ప్రధాన ఆవాసాలుగా మారుతాయి. కాబట్టి మీ ఇంటి చుట్టుపక్కల వాతావరణాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. అలాగే రాత్రి సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలను లేదా పండ్లను డైనింగ్ టేబుల్‌పై మూత లేకుండా బయట ఉంచకూడదు. ఎందుకంటే ఇవి కూడా పురుగులను ఆకర్షిస్తాయి.

సహజ సుగంధ తైలాలు… కీటకాలను దూరంగా ఉంచడంలో కొన్ని రకాల సహజ సువాసనలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందుకోసం వేప నూనె, సిట్రోనెల్లా ఆయిల్ లేదా లెమన్‌గ్రాస్ వంటి సహజమైన సుగంధ తైలాల డిఫ్యూజర్‌లను సాయంత్రం వేళల్లో కిటికీలు, బాల్కనీలు లేదా ముఖద్వారం వద్ద వెలిగించాలి. వీటి నుండి వచ్చే ఘాటైన సువాసన కీటకాలకు అస్సలు పడదు కాబట్టి అవి ఇంటి పరిసరాల్లోకి రావడానికి సాహసించవు. ఒకవేళ ఇంట్లో పురుగుల సమస్య మరీ తీవ్రంగా ఉంటే, నిపుణుల సహాయంతో కీటక నివారణ స్ప్రేలను ఉపయోగించడం ఉత్తమమైన మార్గం.

Follow Us
రాత్రిళ్లు దీపం పురుగులతో విసుగెత్తారా? ఈ టిప్స్‌తో వాటికి చెక్
రాత్రిళ్లు దీపం పురుగులతో విసుగెత్తారా? ఈ టిప్స్‌తో వాటికి చెక్
కరెంటు పోయినా మీ బట్టలు నిమిషాల్లో ఇస్త్రీ చేసేయండిలా.. 
కరెంటు పోయినా మీ బట్టలు నిమిషాల్లో ఇస్త్రీ చేసేయండిలా.. 
ఏపీలో వారికి ఒక్కొక్కరికీ రూ.10 వేలు
ఏపీలో వారికి ఒక్కొక్కరికీ రూ.10 వేలు
  స్పైసీ క్రంచీ స్నాక్.. 10 నిమిషాల్లో నోరూరించేలా బైంగన్ కచ్రీ
  స్పైసీ క్రంచీ స్నాక్.. 10 నిమిషాల్లో నోరూరించేలా బైంగన్ కచ్రీ
ఇంగ్లండ్‌కు పిచ్చి పట్టిందా ఏంది.. 2వ టీ20 తుది జట్టులో మార్పు..!
ఇంగ్లండ్‌కు పిచ్చి పట్టిందా ఏంది.. 2వ టీ20 తుది జట్టులో మార్పు..!
 ఈ టైమ్‌లో స్వీట్లు మాత్రం తినకండి.. తిన్నారో షుగర్‌కు వెల్‌కం
 ఈ టైమ్‌లో స్వీట్లు మాత్రం తినకండి.. తిన్నారో షుగర్‌కు వెల్‌కం
ఇవాళే OTTలోకి వచ్చిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఇవాళే OTTలోకి వచ్చిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మహాలక్ష్మి రాజయోగం ఎంట్రీ.. ఈ రాశుల వారికి డబ్బు, ఉద్యోగంలో..
మహాలక్ష్మి రాజయోగం ఎంట్రీ.. ఈ రాశుల వారికి డబ్బు, ఉద్యోగంలో..
భారత్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు ఇదే..!
భారత్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు ఇదే..!
తాజా రొయ్యలు గుర్తించలేకపోతున్నారా? ఈ టిప్స్ తెలిస్తే ఈజీనే
తాజా రొయ్యలు గుర్తించలేకపోతున్నారా? ఈ టిప్స్ తెలిస్తే ఈజీనే