వర్షాకాలంలో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుంది..? ఈ వాస్తవాలు తెలిస్తే..

Krishna

 03 July  2026

వేసవిలో దాహం వేసినప్పుడు అమృతంలా అనిపించే కొబ్బరి నీళ్లు, నిజానికి అన్ని కాలాల్లోనూ శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో పుష్కలంగా ఉండే పోషకాలు డీహైడ్రేషన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి.

అన్ని కాలాల్లోనూ

చాలా మంది వర్షాకాలంలో కొబ్బరి నీళ్లు తాగడం హానికరం అని భావిస్తుంటారు. కానీ నిపుణుల ప్రకారం.. వర్షాకాలంలో కూడా కొబ్బరి నీళ్లను నిస్సందేహంగా తాగవచ్చు. ఇందులోని పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

వర్షాకాలంలోనూ

సాధారణంగా వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడి రకరకాల అనారోగ్యాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఈ సమయంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది.

రోగనిరోధక శక్తి

వర్షాకాలంలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదే అయినప్పటికీ.. దీనిని మితంగా తీసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో సోడియం పరిమాణం అధికంగా ఉంటుంది. ఒకవేళ ఎక్కువగా తాగితే కడుపు ఉబ్బరం, బీపీ వంటి సమస్యలు వస్తాయి.

అతిగా తాగితే ముప్పే

కొబ్బరి నీళ్లు జీర్ణవ్యవస్థకుఎంతో మేలు చేస్తాయి. వర్షాకాలంలో వచ్చే హానికర బ్యాక్టీరియా వల్ల చాలా మంది కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి సమయాల్లో కొబ్బరి నీళ్లు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి.

జీర్ణక్రియ మెరుగు

కొంతమందికి సహజంగానే కొబ్బరి నీళ్ల పట్ల అలర్జీ ఉంటుంది. అలాంటి వారు వర్షాకాలంలో కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరంలో వాపులు రావడం, పిత్తం పెరగడం, తీవ్రమైన దురద వంటి చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

అలర్జీ బాధితులు

వర్షాకాలంలో కొబ్బరి బొండాం కొట్టించిన వెంటనే తాజా నీళ్లను మాత్రమే తాగాలి. నిల్వ ఉంచిన లేదా రోజుల తరబడి ఉపయోగించని కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరానికి తీవ్ర హాని కలిగే ప్రమాదం ఉంది.

తాజా నీళ్లే తాగాలి

వర్షాకాలంలో కొబ్బరి నీళ్లు తాగడం పూర్తిగా సురక్షితమే. అయితే అలర్జీ లేని వారు, తాజా కొబ్బరి నీళ్లను, నిపుణులు సూచించిన విధంగా ఒక నిర్దిష్టమైన పరిమాణంలో మాత్రమే తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

మితంగా