Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారికి ఒక్కొక్కరికీ రూ.10 వేలు.. త్వరలోనే అమలు..
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే పలు పథకాల కింద ఇస్తున్న నగదును పెంచిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధులను పెంచారు. అయితే రాష్ట్రంలో జూనియర్ లాయర్లకు ఇచ్చిన స్ట్రైఫండ్‌పై ప్రభుత్వం మరో ప్రకటన చేసింది.

ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మరో పథకంపై కీలక ప్రకటన చేసింది. జూనియర్ లాయర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్టైఫండ్ అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రూ.5 వేలు అందిస్తుండగా.. దీనిని రూ.10 వేలకు పెంచనున్నట్లు మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్ స్పష్టం చేశారు. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ అవుతాయని తెలిపారు. కర్నూలులో ఏపీ హైకోర్ట్ బెంచ్ త్వరలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. బెంచ్ ఏర్పాటు కోసం కర్నూలులో స్థలం కూడా కేటాయించామని, ఇందుకోసం హైకోర్టుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలన్నా రాయలసీమ ప్రజల కల త్వరలోనే తీరుతుందని ఫరూక్ పేర్కొన్నారు.
కర్నూలులో హైకోర్ట్ బెంచ్‌కి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. అన్నీ ప్రక్రియలు పూర్తి చేసి త్వరలోనే బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇక లా ఆఫీసర్ల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచామన్నారు. కొత్తగా 96 కోర్టులను ఏర్పాటు చేయనున్నామని, 1770 పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. హైకోర్టులో 245 పోస్టుల భర్తీకి సంబంధించి ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిపారు. ఇక హైకోర్ట్ జడ్జీలకుక గ్రాట్యూటీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచామని, ఏజీలపీల గౌరవ వేతనాన్ని 25 శాతం పెంచామన్నారు.
అటు తమ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లల్లో మైనార్టీల సంక్షేమానికి రూ.16,147.23 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు మంత్రి ఫరూఖ్ చెప్పారు. రెండేళ్లలో రూ.9,759 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇక రూ.4850 కోట్లు మైనార్టీల సంక్షేమ కార్యక్రమాలకు నేరుగా ఖర్చు చేసినట్లు చెప్పారు. ఆక్రమణలకు గురైన 28 వేల ఎకరాల వక్ప్ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందుకు సంబంధించి కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయని అన్నారు. ఇక ప్రధానమంత్రి జన్ వికాస్ పథకం ద్వారా రాష్ట్రంలో ముస్లింల కోసం సద్బావనా మండపాలు నిర్మిస్తామని, అలాగే కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తాలీం-ఏ-హునర్ పథకం ద్వారా ముస్లిం విద్యార్థులకు ఇంటర్, జేఈఈ, నీట్‌లకు ఉచితంగా రెసిడెన్షియల్ శిక్షణ అందిస్తున్నామన్నారు. హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికులకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నట్లు ఫరూక్ పేర్కొన్నారు.
