పుల్లటి పెరుగును పారేయొద్దు.. వంటల్లో వాడితే రుచి రెట్టింపు!

03 July 2026

TV9 Telugu

TV9 Telugu

పుల్లటి పెరుగును కొన్ని రకాల వంటకాల తయారీలో ఉపయోగించడం వల్ల వాటి రుచిని, మృదుత్వాన్ని పెంచచ్చని చెబుతున్నారు నిపుణులు

TV9 Telugu

సాధారణంగా ఇడ్లీ, దోశ పిండిని రాత్రంతా పులియబెట్టడం మనకు అలవాటే! అయితే అప్పటికప్పుడు వీటిని సిద్ధం చేసుకోవాలంటే ఏం కావాలో ఇక్కడ తెలుసుకుందాం

TV9 Telugu

పుల్లటి పెరుగు, కొన్ని నీళ్లతో పిండి మిశ్రమాన్ని తయారుచేసుకుంటే సరిపోతుంది. తద్వారా ఈ వంటకాలు మెత్తగా, మృదువుగా వస్తాయి.. రుచిగానూ ఉంటాయి

TV9 Telugu

ధోక్లా స్పాంజి తరహాలో మెత్తగా, మృదువుగా రావాలంటే అందులో సాధారణ పెరుగుకు బదులు పుల్లటి పెరుగును జత చేయాలి

TV9 Telugu

తద్వారా అది తింటుంటే నోటికి ఒక రకమైన పులుపుదనం తగిలి మరింత రుచికరంగా ఉంటుంది

TV9 Telugu

జొన్న పిండి, రాగి పిండి, రవ్వతో అప్పటికప్పుడు దోశలు వేసుకునే వారు నీళ్లతో పాటు కాస్త పుల్లటి పెరుగుతో పిండి మిశ్రమాన్ని కలుపుకొంటే.. వాటి రుచి పెరుగుతుంది

TV9 Telugu

ఛోలే భటూరే, గుత్తి వంకాయ, మిర్చీ కా సలాన్‌, దహీ ఆలూ.. వంటి గ్రేవీ వంటకాల్లో.. పల్లీలు, నువ్వులు, గసగసాలు, కొబ్బరి తురుము.. వంటివి వాడడం మనకు తెలిసిందే!

TV9 Telugu

అయితే వీటితో పాటు కాస్త పుల్లటి పెరుగు కూడా వేస్తే కూర ఇట్టే నోరూరిస్తుంది. గ్రేవీ మరింత చిక్కగానూ ఉంటుంది