Teja Sajja: హనుమాన్ హీరోకు పెద్దాయన పాదాభివందనం .. వీడియో వైరల్.. ఏం జరిగిందంటే?

హనుమాన్ తర్వాత తేజ సజ్జా క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఈయన్ని దేశవ్యాప్తంగా అందరూ గుర్తు పట్టడమే కాదు.. పాన్ ఇండియన్ సూపర్ హీరో అయిపోయాడు. చిన్న పిల్లలు అయితే హనుమాన్ అంటే తేజ సజ్జానే అని ఫిక్సైపోయారు కూడా.

Teja Sajja: హనుమాన్ హీరోకు పెద్దాయన పాదాభివందనం .. వీడియో వైరల్.. ఏం జరిగిందంటే?
Teja Sajja
Follow us
Praveen Vadla

| Edited By: Basha Shek

Updated on: Nov 26, 2024 | 3:38 PM

ఇండస్ట్రీలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టమే. తేజ సజ్జా విషయంలోనూ ఇదే జరుగుతుందిప్పుడు. చిన్నపుడే ఇండస్ట్రీకి వచ్చి.. ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాదు.. మార్కెట్ కూడా క్రియేట్ చేసుకుంటున్నాడు ఈ కుర్రాడు. తేజ గ్రోత్ చూస్తుంటే.. చాలా మంది హీరోలకు కుళ్లు కూడా వచ్చేస్తుందేమో..? అంతగా మనోడు ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నాడు. ఓ బేబీ సినిమాలో చిన్న పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చిన తేజ.. తాజాగా తనపైనే 50 నుంచి 100 కోట్లు ఈజీగా బడ్జెట్ పెట్టొచ్చనే నమ్మకాన్ని నిర్మాతల్లో కలిగిస్తున్నాడు. తాజాగా గోవాలో జరిగిన ‘ఇఫ్ఫి’ వేడుకల్లో తేజ సజ్జా మరోసారి తన సత్తా చూపించాడు. ఇటీల గోవా వేదికగా జరిగిన ఇఫ్పి వేడుకలలో ‘హనుమాన్‌’ చిత్రాన్ని ప్రదర్శించగా.. ఆడిటోరియం నుంచి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. హనుమంతు పాత్రలో తేజ నటనకు ప్రేక్షకులు అంతా మెస్మరైజ్ అయ్యారు. ఈ వేడుకల్లో ‘హనుమాన్‌’ స్క్రీనింగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి గతంలో దక్షిణాది నటులకు IFFIలో తగిన గుర్తింపు రావడం లేదని పేర్కొన్నారు. అప్పట్లో తాను గోవాకు వచ్చినపుడు టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి లెజెండరీ నటుల ఫోటోలు కూడా కనిపించలేదని చాలా బాధ పడ్డారు. ఎక్కడైతే చిరు ఇలా అన్నాడో.. ఇప్పుడు అదే ప్రతిష్టాత్మక వేదికపై తేజ సజ్జా సత్తా చాటి తెలుగు సినిమాకి గర్వకారణంగా నిలిచారు.

ఇవి కూడా చదవండి

హనుమాన్ అయిపోయిన వెంటనే.. తేజను చప్పట్లతో ముంచెత్తారు ఆడియన్స్. ఇంత చిన్న వయస్సులో తేజ సజ్జా స్ట్రాంగ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయడం గొప్ప విషయమే. హనుమాన్ తర్వాత వచ్చిన క్రేజ్‌ను అంత ఈజీగా పోకుండా జాగ్రత్త పడుతున్నాడు తేజ. ముఖ్యంగా కథల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఫాంటసీ, యాక్షన్‌ అడ్వెంచర్‌గా మిరాయ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో కూడా ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నారు. ఏప్రిల్ 18, 2025న విడుదల కానుంది మిరాయ్.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.