AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kulasekhar: సినిమా ఛాన్సులు రాక దొంగగా మారి.. దీన స్థితిలో కన్నుమూసిన గేయ రచయిత కులశేఖర్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ గేయ రచయిత కుల శేఖర్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన మంగళవారం (నవంబర్ 26) తుది శ్వాస విడిచారు.

Kulasekhar: సినిమా ఛాన్సులు రాక దొంగగా మారి.. దీన స్థితిలో కన్నుమూసిన గేయ రచయిత కులశేఖర్
Kulasekhar
Basha Shek
|

Updated on: Nov 26, 2024 | 3:21 PM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. గతంలో పాటల రచయితగా ఓ వెలుగు వెలిగిన కుల శేఖర్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కుల శేఖర్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సింహాచలంలో పుట్టి పెరిగిన కుల శేఖర్ కు  చిన్నప్పటి నుంచి  సంగీత సాహిత్యాల మీద ఆసక్తి ఉండేది. చదువుకుంటున్న రోజుల్లో పాటలు రాసి బహుమతులు పొందాడు.  అయితే చదువు తర్వాత ఒక ప్రముఖ మీడియా సంస్థలో జర్నలిస్టుగా చేరాడు.  అదే సమయంలో  సిరివెన్నెల సీతారామశాస్త్రి  దగ్గర శిష్యరికం చేస్తూ సినీ గీతాల రచనలో మెలకువలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత  తేజ దర్శకత్వంలో రామోజీ రావు ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై నిర్మించిన  చిత్రం సినిమాతో గేయ రచయితగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో అన్ని పాటలు ఆయనే రాశారు. దీని తర్వాత ఆర్. పి. పట్నాయక్, తేజ లతో కలిసి అనేక సినిమాలకు గేయ రచయితగా పనిచేశారు కుల శేఖర్. చిత్రంతో పాటు జయం, రామ్మా చిలకమ్మ, ఘర్షణ, వసంతం, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా, మృగరాజు, సుబ్బు తదితర సినిమాల్లోని పాటలు కులశేఖర్ కలం నుంచి జాలువారినవే.

అప్పులు బాధతో మానసికంగా కుంగిపోయి, దొంగగా మారి..

కాగా  గీత రచయితగా బిజీగా ఉన్నప్పుడే ప్రేమలేఖ రాశా అనే సినిమాకు దర్శకత్వం వహించారు కుల శేఖర్.  అయితే ఆ సినిమా విడుదలకు చాలా ఆలస్యం కావడం వల్ల అప్పుల పాలయ్యాడు. ఇది అతనిని మానసికంగా కుంగదీసింది. క్రమంగా సినిమా అవకాశాలు కూడా కరువయ్యాయి.  కాగా2013 అక్టోబరు 24 న కాకినాడలో ఒక ఆలయంలో దొంగతనం చేసినందుకు గానూ పోలీసులు కుల శేఖర్ ను అరెస్ట్ చేశారు. అయితే విచారణలో అతని మానసిక స్థితి సరిగా లేదని వదిలేశారు. చికిత్స కోసం రాజమండ్రికి తరలించారు. కాగా కుల శేఖర్ కు హైదరాబాద్ తో పాటు వైజాగ్ లోనూ కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నారు. అయితే  ఎవరూ ఆయన గురించి పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ఇక కులశేఖర్ భార్య ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తోందని సమాచారం.

ఇవి కూడా చదవండి

కాగా  2008లోనే మెదడకు సంబంధించిన సమస్యతో కులశేఖర్ పూర్తిగా జ్ఞాపకశక్తి  కోల్పోయాడని అతని సన్నిహితులు గతంలో చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!