NTR 30: లక్కీ ఛాన్స్ కొట్టేసిన సీనియర్ నటి.. ‘ఎన్టీఆర్ 30’ మూవీలో కీలకపాత్రలో మణిచందన..

ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్‏తో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. ఇందులో జాన్వీ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నది సైతం షూటింగ్‏లో పాల్గొంటుంది. ఈ సినిమాతో అతిలోక సుందరి తనయ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. అంతేకాకుండా.. ఈ సినిమా కోసం జాన్వీ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కాగా..

NTR 30: లక్కీ ఛాన్స్ కొట్టేసిన సీనియర్ నటి.. 'ఎన్టీఆర్ 30' మూవీలో కీలకపాత్రలో మణిచందన..
Ntr 30
Follow us
Rajitha Chanti

|

Updated on: May 05, 2023 | 7:31 AM

ప్రస్తుతం తారక్ ఫ్యాన్స్ అంచనాలన్ని మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న సినిమానే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం పాన్ ఇండియా లెవల్లో భారీగానే స్కెచ్ వేసాడు. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్‏తో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. ఇందులో జాన్వీ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నది సైతం షూటింగ్‏లో పాల్గొంటుంది. ఈ సినిమాతో అతిలోక సుందరి తనయ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. అంతేకాకుండా.. ఈ సినిమా కోసం జాన్వీ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కాగా.. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇక ఈ సినిమా గురించి కొద్ది రోజులుగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో సీనియర్ నటి మణిచందన నటించనున్నట్లు లేటేస్ట్ గా వినిపిస్తోన్న టాక్.

మణిచందన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ త్రవాత పిల్ల నచ్చింది, నిజం వంటి చిత్రాల్లో నటించింది. మాస్ మాహారాజా రవితేజ నటించిన మనసిచ్చాను చిత్రంలో హీరోయిన్ గా నటించింది. తెలుగుతోపాటు.. మలయాళంలోనూ పలు చిత్రాలు చేసింది. సహాయనటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మణిచందన.. ఇప్పుడు ఎన్టీఆర్ 30 చిత్రంలో కనిపించబోతుందట. ఇందులో ఆమె జాన్వీ తల్లి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆమె పాత్రకు ఇంపార్టెంట్ ఉందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ 30 చిత్రాన్ని యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ.250 కోట్ల బడ్జె్ట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.