Director Mani Ratnam: డైరెక్టర్ మణిరత్నం గడ్డం వెనుక సీక్రెట్ ఏంటో తెలుసా?
హీరోలు, హీరోయిన్ల కొత్త సినిమాల లుక్కులే కాదు, కెప్టెన్ కుర్చీలో ఉన్నవాళ్ల పెక్యులియర్ స్టైల్స్ కూడా ఫాలోయర్స్ ని అప్పుడప్పుడూ ఆకట్టుకుంటుంటాయి.
(డా. చల్లా భాగ్యలక్ష్మి, టీవీ9 తెలుగు, హైదరాబాద్)
హీరోలు, హీరోయిన్ల కొత్త సినిమాల లుక్కులే కాదు, కెప్టెన్ కుర్చీలో ఉన్నవాళ్ల పెక్యులియర్ స్టైల్స్ కూడా ఫాలోయర్స్ ని అప్పుడప్పుడూ ఆకట్టుకుంటుంటాయి. అభిమానులే కాదు, ఇండస్ట్రీ జనాలు కూడా ఇంట్రస్టింగ్‌గా చెప్పుకునే అలాంటి విషయాల్లో మణిరత్నం ఫ్రెంచ్ బియర్డ్ ఒకటి. అసలు ఫ్రెంచ్ బియర్డ్ స్టైల్‌ని మణి ఎందుకు పిక్ చేసుకున్నారు? ఎవరిని చూసి ఇన్‌స్పయర్ అయ్యారు? ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? ఇంతకీ సతీమణి సుహాసిని ఏమైనా సజెస్ట్ చేశారా? ఇలాంటి క్వశ్చన్స్ కి అయితే అస్సలు ఫుల్ స్టాప్ పడదు. ఇన్ని అనుమానాలు ఎందుకని ఆ విషయాన్ని మణిరత్నాన్ని అడిగితే నిండుగా నవ్వుతారాయన. నా గడ్డం గురించి కూడా డిస్కషన్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని అంటారు.
”గురు సినిమా టైమ్‌కి క్లీన్ షేవ్‌లోనే ఉండేవాడిని. ఆ తర్వాత రావన్‌కి వర్క్ చేయడం మొదలుపెట్టా. అప్పుడు లైట్ గడ్డం ఉండేది. కొన్నిసార్లు ఓపిక లేక అలాగే వదిలేసేవాడిని. ఒకసారి ఎందుకో షేవ్ చేస్తున్నప్పుడు ఫ్రెంచ్ బియర్డ్ షేప్‌కి తీసుకొచ్చి ఆపేశా. ఆ లుక్ ఏదో బానే ఉందనిపించింది. చుట్టూ ఉన్నవారు కూడా గమనించి స్పెషల్‌గా అడగసాగారు. సరే… కంటిన్యూ చేద్దామా వద్దా అని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఒకటే. ఫ్రెంచ్ బియర్డ్ వల్ల షేవింగ్ టైమ్ మూడు నిమిషాలు మిగులుతోందని (నవ్వుతూ). ఉదయాన్నే మూడు నిమిషాలంటే మామూలు విషయం కాదుగా. పైగా బావుందని అందరూ అంటున్నారు. అందుకే కంటిన్యూ చేస్తున్నా” అని సీక్రెట్ రివీల్ చేశారు మణిరత్నం.