AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasari Narayana Rao: వెండి తెరపై దర్శకరత్న బయోపిక్‌.. దాసరి పాత్రలో నటించనున్న ప్రముఖ హీరో. దర్శకుడు ఎవరంటే.

Dasari Narayana Biopic: తెలుగు సినిమా ప్రస్థానం ఉన్నన్ని రోజులు దాసరి నారాయణ రావు పేరు వినిపిస్తూనే ఉంటుంది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో దాసరి ఒకరు. ఎక్కువ సినిమాలు తీసిన...

Dasari Narayana Rao: వెండి తెరపై దర్శకరత్న బయోపిక్‌.. దాసరి పాత్రలో నటించనున్న ప్రముఖ హీరో. దర్శకుడు ఎవరంటే.
Dasari Bio Pic
Narender Vaitla
|

Updated on: Jul 11, 2021 | 5:05 PM

Share

Dasari Narayana Biopic: తెలుగు సినిమా ప్రస్థానం ఉన్నన్ని రోజులు దాసరి నారాయణ రావు పేరు వినిపిస్తూనే ఉంటుంది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో దాసరి ఒకరు. ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుడిగా గిన్నిస్‌ రికార్డులో కూడా స్థానం సంపాదించుకున్నారు దాసరి. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించి ఎన్నో మైలు రాళ్లను అధిగమించిన దాసరి నారయణ రావు జీవిత కథను బయోపిక్‌గా తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు ధవల సత్యం ఈ సినిమాను డైరెక్ట్‌ చేయనున్నారు. ఇక నిర్మాతగా తాడివాక రమేష్‌ నాయుడు వ్యవహరించనున్నారు. ఇమేజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘దర్శకరత్న’ అనే పేరు టైటిల్‌ ఖరారు చేశారు. దాసరి పాత్రలో ఓ ప్రముఖ హీరో నటించనున్నట్లు నిర్మాత తెలిపారు.

ఇదిలా ఉంటే దాసరి స్మారకార్ధం దాసరి నారాయణరావు నేషనల్ ఫిల్మ్ & టివి నేషనల్ అవార్డ్స్ ప్రదానం చేసేందుకు నిర్మాత తాడివాక రమేష్ నాయుడు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కళాకారులు-సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్) ఇవ్వనున్నారు. ఈ విషయమై తాటివాక రమేష్ నాయుడు మాట్లాడుతూ.. ‘నా గురువు, దైవం దాసరి పేరిట ప్రతి ఏటా ఫిల్మ్ అండ్ టివి నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా దర్శకరత్న పేరుతో దాసరి బయోపిక్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దర్శకులు ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారు. సినిమా కథ చాలా అద్భుతంగా ఉంది. ఓ ప్రముఖ హీరో ఇందులో దాసరిగా నటించనున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం’ అని చెప్పుకొచ్చారు.

Also Read: Director Mani Ratnam: డైరెక్టర్ మణిరత్నం గడ్డం వెనుక సీక్రెట్‌ ఏంటో తెలుసా?

New Look: కండలు తిరిగిన దేహంతో ఉన్న ఈ టాలీవుడ్ హీరో ఎవరో చెప్పుకోండి. మొన్నటి వరకు లవర్‌ బాయ్‌గా.. ఇప్పుడు.

Chiranjeevi: ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్‌.. తెలంగాణ సంప్రదాయాలకు బోనాలు ప్రతీక అంటూ.