AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవర్ఫుల్ లాయర్ గా సత్యదేవ్.. మే 21న ప్రేక్షకుల ముందుకు రానున్న తిమ్మరుసు

‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌, ఉమామ‌హేశ్వ‌రాయ ఉగ్ర‌రూప‌స్య’ వంటి చిత్రాల్లో విల‌క్ష‌ణ క‌థానాయ‌కుడిగా మెప్పించిన‌ సత్యదేవ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం 'తిమ్మరుసు'.

పవర్ఫుల్ లాయర్ గా సత్యదేవ్.. మే 21న ప్రేక్షకుల ముందుకు రానున్న తిమ్మరుసు
Thimmarusu (File Photo)
Rajeev Rayala
|

Updated on: Mar 31, 2021 | 8:50 PM

Share

‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌, ఉమామ‌హేశ్వ‌రాయ ఉగ్ర‌రూప‌స్య’ వంటి చిత్రాల్లో విల‌క్ష‌ణ క‌థానాయ‌కుడిగా మెప్పించిన‌ సత్యదేవ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’ అనేది ట్యాగ్‌లైన్. ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్ గా నటిస్తుంది‌. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 21న విడుద‌ల చేస్తున్నారు.

ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్‌ కోనేరు‌ తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర  నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘‘తిమ్మరుసు’ సినిమా చిత్రీకరణంతా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం అని తెలిపారు. అలాగే  సత్యదేవ్‌ పవర్ఫుల్ లాయర్‌ పాత్రలో కనిపించనున్నారని… ఆయన లుక్‌, క్యారెక్టర్‌ డిజైనింగ్‌ చాలా కొత్తగా ఉంటుందని తెలిపారు. ఇక డైరెక్టర్‌ శరణ్‌ కొపిశెట్టి  పక్కా ప్లానింగ్‌తో సినిమాను శరవేగంగా పూర్తి చేశారు. ఈ సినిమా టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తప్పకుండా సినిమాలో ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు మంచి సందేశం కూడా ఉంటుంది’’ అన్నారు. ఇక ఈ సినిమాలతో పాటు సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Most Eligible Bachelor : అఖిల్ -పూజల మధ్య కెమిస్టీ క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా ఉండనుందట..

Uppena Deleted Scenes: ఆకట్టుకుంటున్న ఉప్పెన డిలీట్ సీన్స్.. బెబ్బమ్మ కోసం ఆశీ ప్రయత్నాలు

Sulthan Pre Release Event LIVE : సుల్తాన్‌‌‌‌గా రానున్న కార్తి.. ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్..