Most Eligible Bachelor : అఖిల్ -పూజల మధ్య కెమిస్టీ క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా ఉండనుందట..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Mar 31, 2021 | 8:40 PM

అక్కినేని యంగ్ హీరో అఖిల్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ

Most Eligible Bachelor : అఖిల్ -పూజల మధ్య కెమిస్టీ క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా ఉండనుందట..
Akhil

Most Eligible Bachelor : అక్కినేని యంగ్ హీరో అఖిల్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ టైటిల్ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలానే గోపీ సుంద‌ర్ సంగీత‌ సార‌ధ్యంలో  సిద్ శ్రీరామ్ పాడిన ‘మనసా మ‌న‌సా’ పాటకు, అలానే ఆ తర్వాత విడుదల చేసిన టీజ‌ర్‌కు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది.

ఇక ఇదే ఉత్సాహంతో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ యూనిట్ తాజాగా మరో సర్ ప్రైజింగ్ న్యూస్ చెప్పింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోని ఏ జిందగీ పాట ఏప్రిల్ 5న విడుదల చేయనుంది చిత్రయూనిట్. ఈ పాటకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. ఈ సినిమాను వేసవి కానుకగా జూన్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రి ఉండేలా డిజైన్ చేసారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Uppena Deleted Scenes: ఆకట్టుకుంటున్న ఉప్పెన డిలీట్ సీన్స్.. బెబ్బమ్మ కోసం ఆశీ ప్రయత్నాలు

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సాయంతో మరో చిన్నారి గుండె పదిలం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu