Rajeev Rayala |
Updated on: Mar 31, 2021 | 9:53 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ కంటే భక్తులు ఎక్కువగా ఉంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్ .
వకీల్ సాబ్ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు.
పింక్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో పవన్ లాయర్ గా కనిపించనున్నాడు.
ముగ్గురు యువతుల తరపున న్యాయం కోసం పోరాడే వకీల్ సాబ్ గా నటిస్తున్నారు పవన్
ఇటీవల విడుదలైన ట్రైలర్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
యూట్యూబ్ ను షేక్ చేస్తూ రికార్డులను తిరగ రాస్తుంది వకీల్ సాబ్ ట్రైలర్.
ప్రపంచవ్యాప్తంగా వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.