Saripodhaa Sanivaaram Review: ‘సరిపోదా శనివారం’ రివ్యూ.. నాని యాక్షన్ డ్రామా హిట్టేనా..?

నాని సినిమా అంటే ఎలా ఉంటుందో ఓ క్లారిటి ఉంది ఆడియన్స్‌కు. తాజాగా ఈయన సరిపోదా శనివారం అంటూ వచ్చాడు. మాస్ హీరో అవ్వాలని ఎప్పట్నుంచో కలలు కంటున్న నానికి ఇన్నాళ్లకు ఇలాంటి కథ దొరికింది. దాంతో ప్రమోషన్స్‌లో చాలా జోరు చూపించాడు. మరి సినిమాలోనూ అంతే దమ్ముందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Saripodhaa Sanivaaram Review: 'సరిపోదా శనివారం' రివ్యూ.. నాని యాక్షన్ డ్రామా హిట్టేనా..?
Saripodhaa Sanivaaram
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajitha Chanti

Updated on: Aug 29, 2024 | 1:36 PM

మూవీ రివ్యూ: సరిపోదా శనివారం

నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్.జె.సూర్య, సాయికుమార్, అభిరామి, విష్ణు తదితరులు

సంగీతం: జేక్స్ బిజోయ్

ఇవి కూడా చదవండి

సినిమాటోగ్రఫీ: మురళి జి

ఎడిట‌ర్ : కార్తీక శ్రీనివాస్

దర్శకుడు: వివేక్ ఆత్రేయ

నిర్మాతలు : డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి

నాని సినిమా అంటే ఎలా ఉంటుందో ఓ క్లారిటి ఉంది ఆడియన్స్‌కు. తాజాగా ఈయన సరిపోదా శనివారం అంటూ వచ్చాడు. మాస్ హీరో అవ్వాలని ఎప్పట్నుంచో కలలు కంటున్న నానికి ఇన్నాళ్లకు ఇలాంటి కథ దొరికింది. దాంతో ప్రమోషన్స్‌లో చాలా జోరు చూపించాడు. మరి సినిమాలోనూ అంతే దమ్ముందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

సూర్య (నాని)కి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. కోపం వచ్చిన మరుక్షణమే కొట్టడానికి వెళ్తుంటాడు. కొడుకు కోపాన్ని చూసిన తల్లి ఛాయాదేవి (అభిరామి) వారంలో ఒక్కరోజు మాత్రమే కోపం చూపించాలని ఒట్టు వేయించుకుని చనిపోతుంది. ఆ రోజు శనివారం అవుతుంది. అలా అప్పట్నుంచి వారం అంతా కోపం వచ్చిన వాళ్ల పేర్లు బుక్కులో రాసుకుని.. శనివారం వరకు నిజంగా ఆ కోపం అలాగే కంటిన్యూ అయితే వెళ్లి కొడతాడు. అలా సూర్య కొట్టిన వాళ్ల నుంచి అతడి తండ్రి (సాయి కుమార్)తో పాటు అక్కకు కూడా సమస్యలు వస్తుంటాయి. దాంతో అక్క పెళ్లి చేసుకున్నా వీళ్లకు దూరంగానే ఉంటుంది. అదే సమయంలో కానిస్టేబుల్ చారులత (ప్రియాంక మోహన్) సూర్య జీవితంలోకి వస్తుంది. సిఐ దయా (ఎస్‌సే సూర్య) దగ్గర చారు కానిస్టేబుల్‌గా ఉంటుంది. మరోవైపు తనకు ఎప్పుడు కోపం వచ్చినా.. సోకులపాలెం అనే ఊరు నుంచి ఎవరో ఒకర్ని తీసుకొచ్చి చావకొడుతుంటాడు దయా. అలా ఓసారి సోకులపాలెం మనుషులతో సూర్యకు రిలేషన్ ఏర్పడుతుంది. అప్పుడే దయా, సూర్య ఫేస్ అవుతారు. అక్కడ్నుంచి ఏం జరిగింది అనేది అసలు కథ..

కథనం:

ముక్కలు ముక్కలుగా చూస్తే ఇది కూడా బాగానే ఉందే.. సరిపోదా శనివారం చూసిన తర్వాత చాలా మంది ఆడియన్స్‌కు కూడా కలిగే ఫీలింగ్ ఇదే. బహుశా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని జోనర్ మాస్ ఒక్కటేనేమో..? జరిగే కథేంటో తెలుసు.. ఏం జరగబోతుందో కూడా తెలుసు. అయినా కూడా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉందంటే దర్శకుడిలో విషయం ఉన్నట్లేగా..! సరిపోదా శనివారం చూస్తుంటే వివేక్ ఆత్రేయపై ఈ ఫీలే వస్తుంది. రొటీన్ కథ తీసుకున్నా.. శ్రీరామ్, ఎవడు లాంటి రిఫరెన్సులు కనిపించినా.. చాలా వరకు బోర్ కొట్టకుండా కమర్షియల్ సినిమా చూపించాడు వివేక్. దానికి నాని, సూర్య తోడయ్యేసరికి మాస్ ఆడియన్స్‌కు సినిమా సరిగ్గా సరిపోయింది.

ఫస్ట్ 15 నిమిషాల్లోనే సినిమా కథ అంతా పూస గుచ్చినట్లు చెప్పేసాడు వివేక్ ఆత్రేయ. అక్కడ్నుంచి ఆ కథను ఎలా ముందుకు తీసుకెళ్లాడనేదే సరిపోదా శనివారం. హీరోకు ఒక్కరోజేగా కోపమొచ్చేది.. మిగిలిన రోజులు అతడు కొట్టినోళ్లు తిరిగి కొట్టరా అనే లాజిక్ పట్టుకుంటే డిస్ కనెక్ట్ అయిపోతాం. లాజిక్స్ పట్టించుకోకుండా ప్రాపర్ కమర్షియల్ సినిమా చూస్తున్నాం అనుకుంటే మాత్రం.. ఈ సరిపోదా శనివారం బాగానే అనిపిస్తుంది. ఫస్టాఫ్ కాస్త స్లోగా మొదలైనా.. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. నాని, ఎస్‌జే సూర్య ఫేస్ ఆఫ్ మొదలయ్యాక కథలో వేగం పెరుగుతుంది. వీళ్ళిద్దర్ని కలిపిన విధానం చాలా బాగుంది. ఓ సమస్యకు ముడిపెట్టి.. దానిచుట్టూ హీరోయిన్ ట్రాక్ అల్లడం.. అక్కడ్నుంచి హీరో తెలియకుండానే ఎస్‌జే సూర్య లైఫ్‌లోకి వెళ్లడం.. ఇవన్నీ బాగా డిజైన్ చేసుకున్నాడు దర్శకుడు వివేక్. సెకండాఫ్ చాలా వరకు పరుగులు పెట్టించాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ.. కాకపోతే సరిపోదా శనివారంకు ఉన్న మెయిన్ మైనస్ లెంత్. 2 గంటల 51 నిమిషాల నిడివి మెయిన్ విలన్.. కాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేదేమో..? ఈ ఫార్మాట్ కథలు కొత్తేం కాదు.. ఒక్క శనివారం కొట్టడం అనే పాయింట్ తప్ప. లెంత్ పరంగా కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే కచ్చితంగా సరిపోదా మంచి సినిమా అయ్యుండేది. అయినా కూడా కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు సరిపోదా ఫుల్ మీల్స్.

నటీనటులు:

నాని మరోసారి ఇరక్కొట్టాడు.. సినిమాలో యాక్టింగ్.. అలాగే విలన్స్‌ను కూడా. మాస్ హీరో అనిపించుకోవాలనే తపన నాని సీన్ టూ సీన్ కనిపించింది. ఎస్‌జే సూర్య మెయిన్ పిల్లర్.. దయ లేని దయా పాత్రకు ప్రాణం పోసాడు.. ప్రియాంక మోహన్ పర్లేదు.. మిగిలిన వాళ్లలో సాయికుమార్ కారెక్టర్ బాగుంది. నాని అక్కగా నటించిన యాక్టర్ కూడా చక్కగా నటించారు. మురళీ శర్మ, హర్షవర్దన్ పాత్రలు పర్లేదు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

సరిపోదా శనివారంకు మరో హీరో ఉన్నాడు.. ఆయనే జేక్స్ బిజాయ్. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో థియేటర్స్‌లో బాక్సులు మోతెక్కిపోయాయి. ఆర్ఆర్‌తో అదరగొట్టాడు జేక్స్. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అయితే ఎడిటింగ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎందుకో దర్శకుడు వివేక్ ఆత్రేయ లెంత్ విషయంలో జాగ్రత్తగా లేడేమో అనిపించింది. చాలా వరకు సీన్స్ కట్ చేసినా కథకు ఏం ప్రమాదం లేదు.. అయినా కూడా కథపై ప్రేమతో అలాగే ఉంచేసాడు. అదే మైనస్ అయింది సినిమాకు. దర్శకుడిగా వివేక్ ఆత్రేయ తనలోని మరో యాంగిల్ చూపించాడు. మేకింగ్ అదిరిపోయింది.. కానీ లెంత్ దగ్గర కాస్త కాంప్రమైజ్ అవ్వాల్సింది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా సరిపోదా శనివారం.. లెంత్ మినహాయిస్తే.. మిగిలింది సరిపోయింది..!

చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు