- Telugu News Photo Gallery Cinema photos Newly Wed Kiran Abbavaram and Rahasya Gorak Share Their Wedding Photos
Kiran Abbavaram: రాజా వారు.. రాణి గారు ఎంత క్యూట్‌గా ఉన్నారో? కిరణ్ అబ్బవరం, రహస్యల పెళ్లి ఫొటోలు ఇవిగో..
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. తన మొదటి హీరోయిన్, ప్రియురాలు రహస్య గోరఖ్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. ఈనెల 22న వీరి వివాహం జరిగింది. తాజాగా తమ పెళ్లి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారీ న్యూ కపుల్.
Updated on: Aug 29, 2024 | 1:32 PM

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. తన మొదటి హీరోయిన్, ప్రియురాలు రహస్య గోరఖ్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. ఈనెల 22న వీరి వివాహం జరిగింది. తాజాగా తమ పెళ్లి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారీ న్యూ కపుల్.

కర్ణాటకలోని కూర్గ్ వేదికగా కిరణ్ అబ్బవరం, రహస్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, అత్యంత సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు.

క పెళ్లి వేడుక తర్వాత రిసెప్షన్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించారు. కిరణ్ అబ్బవరం సొంతూరు రాయచోటిలో పెద కోడివాండ్ల పల్లిలోని తన మామాడి పళ్ల తోటలో ఈ రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు.

తాజాగా తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు కిరణ్ అబ్బవరం, రహస్య.

ప్రీ వెడ్డింగ్ వేడుకలైన హల్దీ, సంగీత్, రిసెప్షన్ కు సంబంధించిన ఫొటోలన్నింటినీ ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారీ న్యూ కపుల్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి

వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 'రాజు వారు.. రాణిగారు( కిరణ్, రహస్యల మొదటి సినిమా) జంట ఎంతో చూడముచ్చటగా ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.