డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట సంబరాలు..ముందుగానే సంక్రాంతి
అనిల్ రావిపూడి..టాలీవుడ్‌లో సక్సెస్‌పుల్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’.. సినిమాలతో డైరెక్టర్‌గా తిరుగులేని విజయాలు అందుకున్నాడు. తాజాగా ఆయన సూపర్‌స్టార్ మహేశ్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా ప్రి రీలీజ్ ఈవెంట్ నేడు(జనవరి 5) జరగబోతోంది. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అయితే సరిలేరు సంబరాలు రెట్టింపు అయ్యే విధంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. గతంలోనే […]

అనిల్ రావిపూడి..టాలీవుడ్‌లో సక్సెస్‌పుల్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’.. సినిమాలతో డైరెక్టర్‌గా తిరుగులేని విజయాలు అందుకున్నాడు. తాజాగా ఆయన సూపర్‌స్టార్ మహేశ్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా ప్రి రీలీజ్ ఈవెంట్ నేడు(జనవరి 5) జరగబోతోంది. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అయితే సరిలేరు సంబరాలు రెట్టింపు అయ్యే విధంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. గతంలోనే అనిల్ దంపతులకు శ్రేయాస్వి.. కూతురు ఉంది. ఇప్పుడు మరో బుడతడు కూడా వారి ఫ్యామిలోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఓటమి ఎరుగని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్లో పొంగల్ ఆనందాలు ముందుగానే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అనిల్‌కు..సూపర్‌స్టార్ మహేశ్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.
It’s a baby boy for my director @AnilRavipudi!! ??? Congratulations to the proud parents…Loads of love & blessing to the lil one. Shine on brother ???
— Mahesh Babu (@urstrulyMahesh) January 5, 2020
ఇక అనిల్..సరిలేరు నీకెవ్వరు మూవీని పక్కా పవర్ పాక్ట్ మూవీగా ఫ్యాన్స్ కోసం సిద్దం చేసినట్టు సమాచారం. కామెడీ, ఎమోషన్‌తో పాటు మహేశ్ ఫ్యాన్స్‌కు కావాల్సిన ఎలివేషన్ సీన్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం జనవరి 11న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
‘మెగాసూపర్’ సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ దిగువన చూడండి :




