అప్పుడు కొడుకు.. మరి ఇప్పుడు..!
గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు.. అనే డైలాగ్ ఇటీవల కాలంలో ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలుసు. ఆ డైలాగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ ఇద్దరే కీలకం. మహేష్‌బాబు గురించి విజయశాంతి చెప్పిన ఈ ఎమోషనల్ డైలాగ్ వెనుక.. అసలు కథేంటని ఇప్పుడు అందరిలో ఒక ప్రశ్న మెదలుతోంది. అందుకే సరిలేరు కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో 30 ఏళ్ల కిందట ‘కొడుకు దిద్దిన కాపురం’ మూవీ సెట్స్‌లో తీసిన […]

గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు.. అనే డైలాగ్ ఇటీవల కాలంలో ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలుసు. ఆ డైలాగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ ఇద్దరే కీలకం. మహేష్‌బాబు గురించి విజయశాంతి చెప్పిన ఈ ఎమోషనల్ డైలాగ్ వెనుక.. అసలు కథేంటని ఇప్పుడు అందరిలో ఒక ప్రశ్న మెదలుతోంది. అందుకే సరిలేరు కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో 30 ఏళ్ల కిందట ‘కొడుకు దిద్దిన కాపురం’ మూవీ సెట్స్‌లో తీసిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “నాటి అద్భుతం నేడు రిపీటవుతోంది” అని ఎమోషనల్ ట్వీట్ పెట్టారు సూపర్‌స్టార్ మహేష్‌బాబు. జీవిత చక్రం తిరుగుతూనే ఉందన్నారు ఆయన. కాగా అప్పట్లో సూపర్‌స్టార్ కృష్ణ సినిమా ద్వారా టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి.. ఇప్పుడు మహేష్ బాబుతో 13 సంవత్సరాల తరువాత రీఎంట్రీ ఇవ్వబోతోంది. దీన్ని ఓ క్యూట్ ఎక్స్‌పీరియన్స్‌గా ఫీలవుతున్నారు అభిమానులు.
ప్రొఫెసర్ భారతి పాత్రలో మహేష్‌బాబుతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు విజయశాంతి. లేడీ అమితాబ్ అనేంత గొప్ప ట్యాగ్‌లైన్ ఉన్నప్పటికీ.. ఆమెలో ఆ తాలూకు గర్వం మాత్రం కనిపించలేదన్నారు మహేష్‌బాబు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫీల్ కూడా అదేనట. మూడు దశాబ్దాల తర్వాత.. మహేష్‌బాబు, విజయశాంతిలను తెరపై కలిపి చూడ్డం తెలుగు ప్రేక్షకుడిక్కూడా ఓ థ్రిల్లింగ్ మూమెంట్. మరి 30ఏళ్ల క్రితం వీరిద్దరు తల్లికొడుకు పాత్రలో నటించగా.. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య బంధమేంటో తెలుసుకోవాలంటే మరో ఆరు రోజులు ఆగాల్సిందే.



