సంక్రాంతికి.. మహేష్‌కి ఉండే కనెక్టివిటీ ఏంటి?

సంక్రాంతి సీజన్‌కి.. సూపర్‌స్టార్ మహేష్‌బాబుకీ వుండే కనెక్టివిటీ ఏంటి..? సంక్రాంతికి రిలీజయ్యే మహేష్‌బాబు సినిమాల ఫలితం మీద టాలీవుడ్‌లో వుండే టాకేంటి..? ఈసారి సంక్రాంతికి మొగుడొచ్చాడన్న పంచ్‌ డైలాగ్‌కి మహేష్‌బాబు న్యాయం చేస్తారా..? ఈ సంక్రాంతికొచ్చినవాళ్లలో అల్లుళ్లెవరు.. మొగుళ్లెవరన్న టాక్‌.. టాలీవుడ్‌తో పాటు ఆడియన్స్‌లో కూడా షురూ ఐందిప్పుడు. అసలు.. సంక్రాంతి వ‌చ్చిందంటే చాలు.. తెలుగు బాక్సాఫీస్ దగ్గర సిసలైన వార్ మొదలైనట్లే. ఈసారి సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలుంటే.. అవన్నీ కలిపి దాదాపు 250 కోట్ల […]

సంక్రాంతికి.. మహేష్‌కి ఉండే కనెక్టివిటీ ఏంటి?
Follow us

| Edited By:

Updated on: Jan 07, 2020 | 5:32 PM

సంక్రాంతి సీజన్‌కి.. సూపర్‌స్టార్ మహేష్‌బాబుకీ వుండే కనెక్టివిటీ ఏంటి..? సంక్రాంతికి రిలీజయ్యే మహేష్‌బాబు సినిమాల ఫలితం మీద టాలీవుడ్‌లో వుండే టాకేంటి..? ఈసారి సంక్రాంతికి మొగుడొచ్చాడన్న పంచ్‌ డైలాగ్‌కి మహేష్‌బాబు న్యాయం చేస్తారా..?

ఈ సంక్రాంతికొచ్చినవాళ్లలో అల్లుళ్లెవరు.. మొగుళ్లెవరన్న టాక్‌.. టాలీవుడ్‌తో పాటు ఆడియన్స్‌లో కూడా షురూ ఐందిప్పుడు. అసలు.. సంక్రాంతి వ‌చ్చిందంటే చాలు.. తెలుగు బాక్సాఫీస్ దగ్గర సిసలైన వార్ మొదలైనట్లే.

ఈసారి సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలుంటే.. అవన్నీ కలిపి దాదాపు 250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు ఓ లెక్కుంది. అన్నింటికంటే ఎక్కువగా సరిలేరు నీకెవ్వరు దాదాపు 100 కోట్ల బిజినెస్ చేసిందట. ఇంత పోటీనీ తట్టుకుని నిలబడాలంటే.. వసూళ్ల ఉట్టి కొట్టే తీరాలన్నది మహేష్‌ క్యాంప్‌ థాట్.

డీఎస్‌పీ మ్యూజిక్, అనిల్ రావిపూడి కామెడీ టచ్‌.. వీటితో పాటు.. 13 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఈ మూవీకి స్పెషల్ ఎసెట్. పదహారేళ్ల కిందటొచ్చిన ఒక్కడు మూవీ.. 2012లో వచ్చిన బిజినెస్‌మేన్ మూవీస్ మహేష్ ఖాతాలో బలమైన సంక్రాంతి సినిమాలు.

మహేష్‌బాబు సంగతి అలా వుంచితే.. ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజుకున్న సంక్రాంతి సెంటిమెంట్ గురించి టాలీవుడ్‌లో గొప్పగా చెప్పుకుంటారు. ఆయన నటించిన ‘టక్కరి దొంగ’, ‘ఒక్కడు’, ‘బిజినెస్ మ్యాన్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘నేనొక్కడినే’ చిత్రాలు సంక్రాంతి సీజన్‌లోనే విడుదలయ్యాయి. కాగా.. 2013లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో మొదలుపెడితే.. ఆయన సంక్రాంతి సినిమాలన్నీ విక్టరీ కొట్టినవే.

గత ఏడాది సంక్రాంతికి రిలీజైన ఎఫ్ 2 మూవీ బంపర్ హిట్టు కొట్టడంతో రాజుగారి పొంగల్ సెంటిమెంట్ ఇంకాస్త స్థిరపడింది. ఆ కాన్ఫిడెన్సే ఈ సంక్రాంతికొచ్చే సరిలేరు నీకెవ్వరు మీద కూడా కనిపిస్తోంది. మహేష్‌ ప్లస్ దిల్‌ రాజు ఇద్దరూ కలిశారుగనుక.. ఈసారి సంక్రాంతికి మొగుడొచ్చినట్లేనన్నది ఫ్యాన్స్ లెక్క.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..