మహేష్- డీఎస్పీ.. ఈ కాంబినేషన్ కిక్కే వేరు
ఐదేళ్ల గ్యాప్‌లో ఐదు సూపర్‌డూపర్ మ్యూజికల్ హిట్స్.. అంటే మాటలు కాదు. మహేష్ మూవీ ఒప్పుకున్నాడంటే.. డీఎస్‌పీ మ్యూజిక్ కొట్టాల్సిందేననే ఫిక్సేషన్ వుంది టాలీవుడ్‌లో. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ రిలీజ్‌కి ముందే ఇంతలా రీసౌండ్ ఇస్తోందంటే.. దానికి ఒక కారణం వీళ్లిద్దరి సూపర్ కాంబోనేషన్. డీఎస్‌పీ బీట్.. మహేష్‌బాబు స్టయిల్.. ఒకచోట కలిస్తే ఓ సూపర్‌సాంగ్ పుట్టడం ఖాయమన్నది టాలీవుడ్‌లో ఓ లెక్క. కెరీర్ స్టార్టింగ్‌లో మహేష్‌బాబు సినిమాలకు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు. […]

ఐదేళ్ల గ్యాప్‌లో ఐదు సూపర్‌డూపర్ మ్యూజికల్ హిట్స్.. అంటే మాటలు కాదు. మహేష్ మూవీ ఒప్పుకున్నాడంటే.. డీఎస్‌పీ మ్యూజిక్ కొట్టాల్సిందేననే ఫిక్సేషన్ వుంది టాలీవుడ్‌లో. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ రిలీజ్‌కి ముందే ఇంతలా రీసౌండ్ ఇస్తోందంటే.. దానికి ఒక కారణం వీళ్లిద్దరి సూపర్ కాంబోనేషన్.
డీఎస్‌పీ బీట్.. మహేష్‌బాబు స్టయిల్.. ఒకచోట కలిస్తే ఓ సూపర్‌సాంగ్ పుట్టడం ఖాయమన్నది టాలీవుడ్‌లో ఓ లెక్క. కెరీర్ స్టార్టింగ్‌లో మహేష్‌బాబు సినిమాలకు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు. ఒకానొక మూమెంట్‌లో మణిశర్మ మ్యూజిక్‌కీ మహేష్ బాబుకీ మంచి కాంబినేషన్ కుదిరింది. కానీ.. వన్ నేనొక్కడినే మూవీ తర్వాత.. ఆ ఈక్వేషన్ టోటల్‌గా మారిపోయింది. సుకుమార్ డైరెక్షన్.. మహేష్‌బాబు యాక్షన్.. డీఎస్‌పీ మ్యూజిక్.. ఈ మూడూ కలిసి ‘1 నేనొక్కడినే’ మూవీని మ్యూజికల్ వండర్‌గా మార్చేశాయి. తర్వాత.. చిన్న గ్యాప్ తీసుకుని.. ‘శ్రీమంతుడు’ మూవీకి చేశాడు డీఎస్‌పీ.
కొరటాల డైరెక్ట్ చేసిన మరో మూవీ ‘భరత్ అనే నేను’క్కూడా డీఎస్‌పీ మేజిక్ బాగా ప్లస్ అయింది. టైటిల్ సాంగ్‌తో పాటు.. యుగళగీతాలక్కూడా బాగా సూటయ్యింది వీళ్ల కాంబో. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వచ్చిన మహేష్ సిల్వర్ జూబ్లీ మూవీ ‘మహర్షి’. దీని సక్సెస్ ఎలిమెంట్స్‌లో కూడా దేవిశ్రీ వాటానే కీలకం. ఇప్పుడు మహేశ్-డీఎస్‌పీ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. మళ్లీ మెస్మరైజ్‌డ్ బీట్స్‌తో మైండ్ బ్లాక్ చేసేశాడు దేవి. ‘డ్యాంగ్‌డ్యాంగ్’ అంటూ ఇచ్చిన మాస్ బీట్.. గుర్తుండిపోయేలా వుంది లైఫ్ లాంగ్.
‘సూర్యుడివో చంద్రుడివో’ అనే లీడ్‌తో వచ్చిన ఫ్యామిలీ బేస్డ్ సాంగ్.. ‘హీ ఈజ్ సో క్యూట్’ అంటూ మహేష్ అందాల్ని పొగిడే పాట కూడా సినిమాను విపరీతంగా పాపులర్ చేస్తున్నాయి. మొత్తానికి డీఎస్‌పీ పాట ఒక్కటి చాలు.. సూపర్‌స్టార్ సినిమాను ప్రేక్షక జనంలోకి డ్రైవ్ చేయడానికి. గతంలో.. మణిశర్మ… మిక్కీ జే మేయర్, ఏఆర్ రెహమాన్ కూడా మహేష్‌బాబు మూవీస్‌కి వర్క్ చేసినా.. గుర్తుండిపోయే పాట మాత్రం డీఎస్‌పీదే.



