AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Like, Share & Subscribe: ట్రావెల్ బ్లాగర్ ఆకట్టుకున్న సంతోష్ శోభన్..”లైక్ షేర్ అండ్  సబ్‌స్క్రైబ్” ట్రైలర్

ఈ ఇంట్రెస్టింగ్ మూవీ నవంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. టీజర్, పాటలు సినిమా పై అంచనాలను పెంచాయి.

Like, Share & Subscribe: ట్రావెల్ బ్లాగర్ ఆకట్టుకున్న సంతోష్ శోభన్..లైక్ షేర్ అండ్  సబ్‌స్క్రైబ్ ట్రైలర్
Like, Share & Subscribe
Rajeev Rayala
|

Updated on: Oct 26, 2022 | 8:33 AM

Share

ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల యూత్‌ఫుల్ లవ్ అండ్ క్రైమ్ ఎంటర్‌టైనర్ ‘లైక్ షేర్ అండ్  సబ్‌స్క్రైబ్’. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ నవంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. టీజర్, పాటలు సినిమా పై అంచనాలను పెంచాయి. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ కాన్ ఫ్లిక్ట్ ని రివిల్ చేయకుండానే చాలా చాకచక్యంగా క్యూరియాసిటీని పెంచుతూ ట్రైలర్‌ను కట్‌ చేశాడు. సంతోష్ శోభన్ ట్రావెల్ బ్లాగర్ గా తన యూట్యూబ్ ఛానెల్ కోసం కొత్త వీడియోని షూట్ చేయడానికి వెళ్ళిన ట్రిప్ లో ఫరియా అబ్దుల్లాని కలవడం, ప్రేమలో పడటం చాలా క్రేజీగా ప్రజంట్ చేశారు. కథాంశం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.

మేర్లపాక గాంధీ కామెడీని డీల్ చేయడంలో దిట్ట. ఈ సినిమాలో కావల్సినంత వినోదాన్ని వుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్ధమౌతుంది. ట్రైలర్ నక్సల్స్, పోలీసులు, రౌడీ బ్యాచ్ ని ప్రజంట్ చేసిన విధానం చాలా థ్రిల్లింగా వుంది. ఈ ట్రైలర్ లో  సంతోష్ శోభన్ డైనమిక్‌గా ఉన్నాడు. ఫరియా అబ్దుల్లాతో లవ్ ట్రాక్ ఆకట్టుకుంది. బ్రహ్మాజీ టైమ్ బాంబ్ ఎపిసోడ్ నవ్విస్తుంది. నెల్లూరు సుదర్శన్ తన కామిక్ టైమింగ్‌తో అలరించాడు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. “మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రభాస్ గారికి ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ టీం తరపున కృతజ్ఞతలు. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. మేర్లపాక గాంధీ గారు ఇచ్చిన కథతో ఎక్ మినీ కథ చేశాను. అది మంచి విజయం సాధించింది. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు ఆయన దర్శకత్వం నటించడం ఆనందంగా వుంది. మా నిర్మాత వెంకట్ బోయినపల్లి గారికి కృతజ్ఞతలు. ఫరియా అబ్దుల్లా ని ఈ సినిమాలో చూసి అందరూ సర్ ప్రైజ్ అవుతారు. బ్రహ్మజీ గారి పాత్ర ఇందులో అవుట్ స్టాండింగ్ గా వుంటుంది. నవంబర్ 4న సినిమా విడుదలౌతుంది. అందరూ తప్పకుండా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్