AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhamaka: మాస్ మహారాజ ఆశలన్నీ ధమాకా పైనే.. క్రిస్‌మస్‌కు రెడీ అవుతోన్న సినిమా

ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు మాస్ మహారాజా ఆశలన్నీ ధమాకా  సినిమానే ఉన్నాయి.  కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ధమాకా..

Dhamaka: మాస్ మహారాజ ఆశలన్నీ ధమాకా పైనే.. క్రిస్‌మస్‌కు రెడీ అవుతోన్న సినిమా
Dhamaka
Rajeev Rayala
|

Updated on: Oct 26, 2022 | 8:43 AM

Share

మాస్ మహారాజా రవితేజ చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే క్రాక్ సినిమాతో హిట్ అందుకున్నాడు. కరోనా సంక్షోభం తర్వాత విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‏గా నిలవడమే కాకుండా భారీగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత విడుదలైన ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు మాస్ మహారాజా ఆశలన్నీ ధమాకా  సినిమానే ఉన్నాయి.  కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ధమాకా ను తెరకెక్కిస్తున్నారు. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.

రీసెంట్ గా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ధమాకా విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇటివలే విడుదలైన మాస్ క్రాకర్ టీజర్ సినిమా ట్యాగ్ లైన్ కి తగ్గట్టు ‘డబుల్ ఇంపాక్ట్’ క్రియేట్ చేసింది.ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ సినిమా పై మాస్ రాజా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే త్రినాద్ తెరకెక్కించిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమా చూపిస్తా మామ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ధమాకా సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్ చూడాలి మరి ఏంజరుగుతుందో..

ఇవి కూడా చదవండి
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం