AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaarasudu : బడా సినిమాలకు పోటీగా సంక్రాంతి బరిలో దళపతి సినిమా

ఈ సినిమాకు తమిళ్ టైటిల్ వారిసు. ఈ  చిత్రం చివరి షెడ్యూల్ మినహా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే నెల నుంచి సినిమా ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. దీపావళి సందర్భంగా 2023 సంక్రాంతికి వారసుడుని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Vaarasudu : బడా సినిమాలకు పోటీగా సంక్రాంతి బరిలో దళపతి సినిమా
Vaarasudu
Rajeev Rayala
|

Updated on: Oct 26, 2022 | 8:52 AM

Share

దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారసుడు’. ఈ సినిమాకు తమిళ్ టైటిల్ వారిసు. ఈ  చిత్రం చివరి షెడ్యూల్ మినహా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే నెల నుంచి సినిమా ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. దీపావళి సందర్భంగా 2023 సంక్రాంతికి వారసుడుని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో మేకర్స్ పండుగ సీజన్‌ ను సద్వినియోగం చేసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్‌ లో విజయ్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్, ఒక పెద్ద సుత్తిని పట్టుకొని కనిపించారు. యాక్షన్-బ్లాక్ ని సూచిస్తున్న ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.

క్లాసియెస్ట్ బెస్ట్ లుక్‌ లో విజయ్‌ని ప్రజంట్ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్, సెకండ్ లుక్ పోస్టర్ ‌లకు భారీ స్పందన వచ్చింది. టైటిల్, పోస్టర్లు భారీ అంచనాలను నెలకొల్పాయి. పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక. అయితే సంక్రాంతి బరిలో ఇప్పటికే బాలయ్య వీరసింహారెడ్డి, మెగాస్టార్ వాల్తేరు వీరయ్య లాంటి బడా సినిమాలు ఉన్నాయి. వీటితోపాటు ఏజెంట్ అంటూ అఖిల్ కూడా రెడీ అవుతున్నాడు. ఇంత పోటీలో విజయ్ కూడా బరిలోకి దిగుతుండటంతో ఇప్పుడు మరింత ఆసక్తి నెలకొంది. మరి మన స్టార్ హీరోల సినిమాలను తట్టుకొని వారసుడు నిలబడతాడేమో చూడాలి.

ఈ సినిమాలో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!