Samyuktha Menon: గోల్డెన్ లెగ్ అనే కామెంట్స్ గురించి సంయుక్త మీనన్ ఏమన్నదంటే.
లేటెస్ట్ గా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలో నటించింది. ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతోంది సంయుక్తా మీనన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ భామ. ఆ సినిమాలో రానా భార్యగా నటించి మెప్పించింది. ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాతో మరో హిట్ అందుకుంది. అలాగే ధనుష్ నటించిన సార్ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది. ఇక లేటెస్ట్ గా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలో నటించింది. ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో సంయుక్త ఖాతాలో మరో హిట్ పడింది. సాయి ధరమ్ తేజ్ కు ఈ సినిమా సాలిడ్ కంబ్యాక్ అనే చెప్పాలి.
వరుస విజయాలతో దూసుకుపోతోన్న సంయుక్త మీనన్ కు మరిన్ని అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంయుక్త మీనన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్ కాన్సెప్ట్ అనేదే నాకు అంతగా నచ్చదు అని తెలిపింది సంయుక్త.
అలాగే లక్ వల్లే సక్సెస్ వస్తుంది అనేదాన్ని కూడా నమ్మను. అమ్మాయిలు లక్కీ అని సినిమాల్లోకి తీసుకుంటున్నారనేది కరెక్ట్ కాదు. మేము చాలా కష్టపడతాం.. అలాగే మా ప్రయత్నాలు మేము చేస్తాము, అందువల్ల మాకు సక్సెస్ వస్తుంది అని చెప్పుకొచ్చింది. పాత్రకు న్యాయం చేస్తుందంటేనే ఆ అమ్మాయిని సినిమాలోకి తీసుకుంటారు. ప్రతిభ లేకుంటే సినిమా ఆఫర్స్ రావు.
