Shriya Saran: మరోసారి ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి రెడీ అయిన హాట్ బ్యూటీ
ఇప్పటికి కూడా వన్నె తగ్గని అందంతో కవ్విస్తోంది శ్రియ. యంగ్ హీరోలతోనే కాదు సీనియర్ హీరోలతోనూ నటించి ఆకట్టుకుంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లిపీటలెక్కింది ఈ చిన్నది. ఇప్పుడు అడపా దడపా సినిమాలలో కనిపిస్తూ అలరిస్తోంది.
శ్రియా శరణ్.. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో ఈ చిన్నది ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ అందాల భామ. ఇప్పటికి కూడా వన్నె తగ్గని అందంతో కవ్విస్తోంది శ్రియ. యంగ్ హీరోలతోనే కాదు సీనియర్ హీరోలతోనూ నటించి ఆకట్టుకుంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లిపీటలెక్కింది ఈ చిన్నది. ఇప్పుడు అడపా దడపా సినిమాలలో కనిపిస్తూ అలరిస్తోంది. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాలో చిన్న పాత్ర చేసింది. శ్రియ గతంలో చాలా స్పెషల్ సాంగ్స్ లో నటించిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు ఈ అమ్మడు మరోసారి స్పెషల్ సాంగ్ తో అలరించనుందట.. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాలో..
శ్రియ గతంలో స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కనిపించి ఆకట్టుకుంది. తాజాగా ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. చిరంజీవి తో కలిసి ఠాగూర్ సినిమా చేసింది శ్రియ. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.
భోళాశంకర్ అనే టైటిల్ తో వస్తోన్న ఈ సినిమాలో కీర్తిసురేష్ చిరు సిస్టర్ గా కనిపించనుంది. అలాగే తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం శ్రియ ను సంప్రదించారట మేకర్స్. ఇక ఈ సాంగ్ కోసం కోటి రూపాయిల వరకు రెమ్యునరేషన్ అందుకోనుందట.. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.