AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sampoornesh Babu: “క్యాలీ ఫ్లవర్”తో మగాళ్లకు రక్షణ కల్పిస్తానంటున్న సంపూర్ణేష్ బాబు..

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం క్యాలీ ఫ్లవర్‌’ అనే స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ముందుకు రానున్నారు.

Sampoornesh Babu: క్యాలీ ఫ్లవర్తో మగాళ్లకు రక్షణ కల్పిస్తానంటున్న సంపూర్ణేష్ బాబు..
Sampoornesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 17, 2021 | 8:24 AM

Sampoornesh Babu: ‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం క్యాలీ ఫ్లవర్‌’ అనే స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ముందుకు రానున్నారు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకులు. . ఈ చిత్రాన్ని నవంబరు 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు నిర్మాతలు.  ఈ సినిమా గురించి హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ..

‘మగాడు తన శీలాన్ని కాపాడుకుంటే దేశంలో ఎలాంటి నేరాలు జరగవు అన్నారు. ఒక మగాడి శీలం పోతే దాని కోసం చేసే పోరాటమే క్యాలీ ఫ్లవర్ కథ. శీలాన్ని కాపాడే శీల రక్షకుడే ఈ క్యాలీ ఫ్లవర్. నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా హృదయకాలేయం, కొబ్బరిమట్ట, సింగం 123 లాంటి సినిమాలే గుర్తున్నాయి. ఇప్పుడు రాబోతోన్న క్యాలీ ఫ్లవర్ కూడా అదే కోవకు చెందుతుంది అన్నారు సంపూ.  ఈ మూవీ డైరెక్టర్ రాధా కృష్ణ తన శాడిజాన్ని చూపించి.. నాలోంచి నటుడిని బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని నవ్వించే ప్రయత్నమే ఈ క్యాలీ ఫ్లవర్. నిర్మాతలకు ఇది మొదటి సినిమా. అయినా కూడా కరోనా సమయంలో నిబంధనలు పాటిస్తూ.. సినిమాకు ఏం కావాలో అది సమకూర్చారు. కంటిన్యూగా 20 రోజులు షూట్ చేశాం. షెడ్యూల్ పూర్తి చేశాం. షూటింగ్ చేయడం ఒకెత్తు అయితే.. అందరికీ పని కల్పించడం మరో ఎత్తు. అందరూ హ్యాపీగా ఫీలయ్యారు. క్యాలీ ఫ్లవర్‌తో మనం కూర వండుకోవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు. సాంబార్ చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇది అద్భుతమైన సినిమా అవుతుంది. త్వరలోనే ఓ పాట రాబోతోంది. హీరో రేప్‌కు గురైన తరువాత వచ్చే పాట అది. అద్భుతంగా ఉంటుంది. సినిమా హిట్ అయితే దానికి కారణం  ఆడియెన్స్ . తేడా కొట్టిందంటే అది నా వల్లే అని నేను మనస్ఫూర్తిగా తీసుకుంటాను. ఈ సినిమా గనుక హిట్ అయితే ఇంకో పది సినిమాలు రెడీగా ఉంటాయి. నా నుంచి ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చే ప్రయత్నం చేశాం. నన్ను నమ్మండి. డేట్స్ కొంచెం అడ్జస్ట్ కాకపోవడంతో ఇలా కాస్త ముందుకు వస్తున్నాం. ఇది ఎంత వరకు రీచ్ అవుతుందో మాకు తెలియడం లేదు. మా ప్రయత్నం మేం చేస్తున్నాం. నవంబర్ 26న థియేటర్లోకి రాబోతోన్నాం. మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. మీరేం కోరుకుంటున్నారో అవన్నీ ఇందులో ఉంటాయి. నవంబర్ 26న నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bangarraju: నాగలక్ష్మి లుక్ వచ్చేది అప్పుడే.. ఆసక్తిక పోస్టర్ రిలీజ్ చేసిన బంగార్రాజు యూనిట్..

Pushpa Song: పుష్ప రాజ్ ఊరమాస్ లుక్.. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డ లిరికల్ ప్రోమో రిలీజ్..

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ సీరియస్.. వాష్‏రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్న సిరి.. ఆందోళనలో హౌస్‏మేట్స్..