Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangarraju: నాగలక్ష్మి లుక్ వచ్చేది అప్పుడే.. ఆసక్తిక పోస్టర్ రిలీజ్ చేసిన బంగార్రాజు యూనిట్..

కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కిస్తున్న చిత్రం బంగార్రాజు. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని

Bangarraju: నాగలక్ష్మి లుక్ వచ్చేది అప్పుడే.. ఆసక్తిక పోస్టర్ రిలీజ్ చేసిన బంగార్రాజు యూనిట్..
Bangarraju
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 16, 2021 | 9:27 PM

కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కిస్తున్న చిత్రం బంగార్రాజు. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్‏గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈసారి ఇందులో నాగ్ తనయుడు నాగ చైతన్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక నాగ్ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతూకు జోడిగా కృతి శెట్టి నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బంగార్రాజు సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.

ఇందులో కృతి శెట్టి నాగలక్ష్మి పాత్రలో నటిస్తుంది. తాజాగా ఆమెకు పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ… ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. అందులో ముఖం కనిపించకుండా.. రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న నాగలక్ష్మి పోస్టర్ షేర్ చేశారు. ఇక నాగలక్ష్మి ఫుల్ పోస్టర్ నవంబర్ 18న ఉదయం 10 గంటల 18 నిమిషాలకు విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. ఈ సినిమాను జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమాలో నాగార్జున బంగార్రాజు పాత్రలో నటిస్తుండగా.. రమ్యకృష్ణ సత్యభామ పాత్రలో నటిస్తోంది. ఇందులో చలపతి రావు.. రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Also Read: Pushpa Song: పుష్ప రాజ్ ఊరమాస్ లుక్.. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డ లిరికల్ ప్రోమో రిలీజ్..

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ సీరియస్.. వాష్‏రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్న సిరి.. ఆందోళనలో హౌస్‏మేట్స్..

Ramya Krishna: మెగాస్టార్ సినిమాలో రమ్యకృష్ణ.. కీలక పాత్రలో నటించనున్న శివగామి..