Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sameera Reddy: సన్నగా మారడానికి సమీరా రెడ్డి చెప్తున్న టిప్స్ ఏంటో తెలుసా..

సమీరా రెడ్డి..ఒకప్పుడు ఈ అమ్మడు తన అందంతో కుర్రకారుని కట్టిపడేసింది. తెలుగు,తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Sameera Reddy: సన్నగా మారడానికి సమీరా రెడ్డి చెప్తున్న టిప్స్ ఏంటో తెలుసా..
Sameera Reddy
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 26, 2021 | 4:39 PM

Sameera Reddy: సమీరా రెడ్డి..ఒకప్పుడు ఈ అమ్మడు తన అందంతో కుర్రకారుని కట్టిపడేసింది. తెలుగు,తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన సమీరా రెడ్డి కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగానే పెళ్లిచేసుకుంది. ఆతర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు అభిమానులతో టచ్ లోనే ఉంటుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు హెల్త్ టిప్స్ ఇస్తూ ఆకట్టుకుంటుంది సమీరా. అధిక బరువును తగ్గించుకోవాలంటే ఏం చేయాలి.? అనే దానిపై సమీరా అభిమానులకు సలహాలు ఇచ్చారు. వారానికి 4 సార్లు యోగా .. బ్యాడ్మింటన్ లతో పాటు.. అడపాదడపా ఉపవాసం చేస్తున్నా. నేను దీనిని కొనసాగిస్తూ.. దీపావళి నాటికి లక్ష్యాన్ని సాధిస్తానని అనుకుంటున్నాను అని తెలిపారు సమీరా రెడ్డి. ఈ మేరకు సోషల్ మీడియాలో బరువు పెరిగిన ఫోటోను ఆతర్వాత కాస్త సన్నగా మారిన ఫోటోను షేర్ చేసింది సమీరా రెడ్డి.

అవి చూసి మోసపోవద్దని అన్నారు సమీరా. నేను వ్యాయామం చేస్తున్నాను. ఫలితాలను చూస్తున్నాను. కానీ నాకు పొట్టచుట్టూ అదనపు కొవ్వు ఉంది. దానిని కరిగించే ప్రణాళిక ఉంది అని తెలిపారు. అడపాదడపా ఉపవాసం చేయడం.. చక్కెర నియంత్రణ… యోగా .. బ్యాడ్మింటన్ వంటివి తన రెసీపీలో ఉన్నాయట. అలా చేసి బరువును తగ్గించుకున్నా అని తెలిపారు సమీరా రెడ్డి. ఇటీవల నేచురల్ బ్యూటీ పేరుతో సమీరారెడ్డి మేకప్ లెస్ డీగ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతుంటే వాటికి ట్రోల్స్ ఎదురవుతున్నాయి. అన్నిటికీ సమీరా కౌంటర్లు వేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Tollywood: ఆదిపురుష్ కోసం ప్ర‌భాస్‌కు 100 కోట్ల రెమ్యూన‌రేష‌న్..! ఈ లిస్ట్‌లో ఉన్న నెక్ట్స్ టాలీవుడ్ హీరో ఎవ‌రంటే..?

Karthikeya: అజిత్‌తో స‌మానంగా మాస్ పోస్ట‌ర్..కార్తికేయను రా.. ర‌మ్మంటున్న అరవ ఆడియన్స్

Star Maa: బడా మూవీలపై ఫోకస్ చేసిన ప్రముఖ ఛానల్.. భారీ సినిమాల శాటిలైట్స్ రైట్స్ దక్కించుకున్న స్టార్ మా..

Kanabadutaledu: నేర పరిశోధనలో వీరపనితనం చూపించడానికి కనబడుటలేదు అంటూ రాబోతున్న సునీల్.. టీజర్ టాక్