Tollywood: ఆదిపురుష్ కోసం ప్ర‌భాస్‌కు 100 కోట్ల రెమ్యూన‌రేష‌న్..! ఈ లిస్ట్‌లో ఉన్న నెక్ట్స్ టాలీవుడ్ హీరో ఎవ‌రంటే..?

ఒకప్పుడు మన సినిమాలకు కలెక్షన్లు వంద కోట్లు వస్తే గొప్పగా చెప్పుకునే వారు. ఆ తరువాత వంద కోట్ల బడ్జెట్‌ అన్న ట్రెండ్ కొద్ది రోజులు నడిచింది. ఇప్పుడు మరో కొత్త కాంపీటీషన్‌ తెర మీదకు వచ్చింది.

Tollywood: ఆదిపురుష్ కోసం ప్ర‌భాస్‌కు 100 కోట్ల రెమ్యూన‌రేష‌న్..! ఈ లిస్ట్‌లో ఉన్న నెక్ట్స్ టాలీవుడ్ హీరో ఎవ‌రంటే..?
Tollywood Heros
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 26, 2021 | 4:30 PM

ఒకప్పుడు మన సినిమాలకు కలెక్షన్లు వంద కోట్లు వస్తే గొప్పగా చెప్పుకునే వారు. ఆ తరువాత వంద కోట్ల బడ్జెట్‌ అన్న ట్రెండ్ కొద్ది రోజులు నడిచింది. ఇప్పుడు మరో కొత్త కాంపీటీషన్‌ తెర మీదకు వచ్చింది. అదే వంద కోట్ల పేమెంట్‌. యస్‌… పాన్ ఇండియా హీరోలకు వంద కోట్ల పేమెంట్ అన్నది డ్రీమ్ నెంబర్‌గా మారిపోయింది. మరి పోటిలో ఎంత మంది హీరోలున్నారు.? తెలుసుకుందాం ప‌దండి. బాహుబలి సినిమా ఇండియన్‌ సినిమా స్టేచర్‌నే కాదు… తారల మార్కెట్‌ రేంజ్‌ను కూడా మార్చేసింది. అప్పటి వరకు రీజినల్‌ స్టార్స్‌, హిందీ స్టార్స్ అన్న కేటగిరీస్‌ మాత్రమే ఉండేవి.. కానీ ఇప్పుడు లెక్కలు వేరు. పాన్ ఇండియా స్టార్స్ అన్న కొత్త కేటగిరి ఇండియన్ సినిమా మార్కెట్‌ను రూల్‌ చేస్తోంది. ఈ లిస్ట్‌లో ఆల్రెడీ సెటిల్ అయ్యారు బాహుబలి ప్రభాస్‌.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ ఇప్పుడు పేమెంట్ విషయంలోనూ నెంబర్‌వన్‌గా ఉన్నారు. ఆదిపురుష్ సినిమాకు డార్లింగ్ వంద కోట్ల పారితోషికం అందుకుంటున్నారన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఇన్‌సైడ్‌ టాక్‌. దీంతో డార్లింగ్ తరువాత ఈ ఫీట్‌ను అచ్చీవ్ చేసే సౌత్‌ హీరో ఎవరు..? అన్న డిస్కషన్ జరుగుతోంది. ఆల్రెడీ పుష్పతో పాన్ ఇండియా ఎంట్రీకి రెడీ అవుతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. ట్రిపులార్‌తో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కూడా ఈ లిస్ట్‌లోకి అడుగు పెడుతున్నారు. సో ఇక ఈ హీరోల నెక్ట్స్ టార్గెట్‌ వంద కోట్ల పేమెంటే అన్న ప్రచారం జరుగుతోంది. మరి వీళ్లలో ఆ మార్క్‌ను ముందుగా రీచ్‌ అయ్యే హీరో ఎవరు.. ఈ విషయంలో ఫ్యాన్స్ కూడా ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు.

అయితే అందరిలో అల్లు అర్జున్‌కి కాస్త అడ్వాంటేజ్‌ ఉందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగుతో పాటు మలయాళంలోనూ బన్నీ స్టార్‌ ఇమేజ్‌ ఉంది. దీనికి తోడు బన్నీ హిందీ డబ్బింగ్ సినిమాలకు నార్త్‌లో భారీ వ్యూస్‌ రావటం మరో ప్లస్ పాయింట్‌.. సో పాన్ ఇండియా హీరోగా సెటిల్ అయ్యే ఛాన్స్ బన్నీకే కాస్త ఎక్కువ అంటున్నారు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్‌. సో పేమెంట్ విషయంలోనూ బన్నీనే ముందుగా వంద కోట్లు అందుకుంటారని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు ఫ్యాన్స్.

అయితే బాహుబలితో ప్రభాస్‌ను నేషనల్ మార్కెట్‌లో నెంబర్‌ వన్‌గా నిలబెట్టిన… రాజమౌళి.. ఎన్టీఆర్, తారక్‌కు కూడా అదే రేంజ్ ఇమేజ్‌ను తెచ్చిపెడతారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ట్రిపులార్ కూడా బాహుబలి రేంజ్‌లో క్లిక్ అయితే… నెక్ట్స్ సినిమాకే వంద కోట్ల పేమెంట్‌ లిస్ట్‌లో ఎన్టీఆర్‌, చెర్రీ కూడా చేరటం ఖాయం అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ రేసులో మహేష్ బాబు మాత్రం బాగా వెనకబడ్డారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సర్కారువారి పాట రీజినల్ సినిమానే.. సో ఇప్పటికిప్పుడు మహేష్ ఈ బరిలో నిలచే ఛాన్స్ అయితే లేదు. నెక్ట్స్ త్రివిక్రమ్ సినిమా పాన్ ఇండియా అన్న ప్రచారం జరుగుతున్నా… ఇంకా అఫీషియల్‌గా కన్ఫార్మ్ చేయలేదు. సో.. ప్రజెంట్ రీజినల్‌ స్టార్‌గా హయ్యస్ట్‌ పేమెంట్ అందుకుంటున్నా… వంద కోట్ల రేసులోకి మాత్రం సూపర్‌ స్టార్ ఎంట్రీ ఇవ్వడానికి ఇంకాస్త టైమ్‌ పడుతుందంటున్నారు క్రిటిక్స్‌.

Also Read: అజిత్‌తో స‌మానంగా మాస్ పోస్ట‌ర్..కార్తికేయను రా.. ర‌మ్మంటున్న అరవ ఆడియన్స్

‘కొత్త జంటల శోభనానికి పనికిరావు’…జగనన్న ఇళ్లపై సొంత పార్టీ ఎమ్మెల్యే కామెంట్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!