AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: అలాంటి మూవీలనే నేను ఇష్టపడతా.. ఈ సినిమా కూడా అలాంటిదే..

అందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కాస్త జోరు తగ్గించింది. ఇటీవలే పెళ్లిపీటలెక్కిన ఈ అమ్మడు మునుపటిలా వచ్చిన సినిమాలన్నీ చేయకుండా ఆచి తూచి అడుగులు వేస్తుంది.

Kajal Aggarwal: అలాంటి మూవీలనే నేను ఇష్టపడతా.. ఈ సినిమా కూడా అలాంటిదే..
Rajeev Rayala
|

Updated on: Jun 26, 2021 | 5:12 PM

Share

Kajal Aggarwal: అందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కాస్త జోరు తగ్గించింది. ఇటీవలే పెళ్లిపీటలెక్కిన ఈ అమ్మడు మునుపటిలా వచ్చిన సినిమాలన్నీ చేయకుండా ఆచి తూచి అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య తోపాటు.. శంకర్ కమల్ హాసన్ చేస్తున్న ఇండియన్ 2 సినిమాలు ఉన్నాయి. వీటితోపాటుగా.. కింగ్ నాగార్జున తో ఓ సినిమా చేస్తుంది కాజల్ అగర్వాల్. అలాగే బాలీవుడ్ సినిమాలోనూ నటిస్తుంది కాజల్. ఉమా అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కితుంది. ఉమా అనే అమ్మాయి కారణంగా పెళ్లి ఇంట్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనే స్టోరీతో డైరెక్టర్ స్క్రిప్ట్ రెడీ చేసాడు. పెళ్లి తర్వాత కాజల్ ఓకే చేసిన ఫస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఇది. కాజల్ ఉమా పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను నూతన దర్శకుడు తతగత సింఘా డైరెక్ట్ చేయనున్నాడు.  మిరాజ్ గ్రూప్ బ్యానర్ పై అవికేష్ ఘోష్ – మంతరాజ్ పాలివాల్ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుజోయ్ ఘోష్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ.. నటిగా ఎల్లప్పుడూ నన్ను సవాల్ చేసే పాత్రలతో పాటు వినోద్మాతక కథల్లో నటించడానికి నేను ఇష్టపడతాను. ‘ఉమ’ మూవీ కూడా అలాంటిదే. ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా”.. అంటూ చెప్పుకొచ్చింది.  ఈ సినిమా ఏడాది చివరిలో ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి: 

Kanabadutaledu: నేర పరిశోధనలో వీరపనితనం చూపించడానికి కనబడుటలేదు అంటూ రాబోతున్న సునీల్.. టీజర్ టాక్

Star Maa: బడా మూవీలపై ఫోకస్ చేసిన ప్రముఖ ఛానల్.. భారీ సినిమాల శాటిలైట్స్ రైట్స్ దక్కించుకున్న స్టార్ మా..

Karthikeya: అజిత్‌తో స‌మానంగా మాస్ పోస్ట‌ర్..కార్తికేయను రా.. ర‌మ్మంటున్న అరవ ఆడియన్స్

Tollywood: ఆదిపురుష్ కోసం ప్ర‌భాస్‌కు 100 కోట్ల రెమ్యూన‌రేష‌న్..! ఈ లిస్ట్‌లో ఉన్న నెక్ట్స్ టాలీవుడ్ హీరో ఎవ‌రంటే..?

చుక్కలన్నంటిన బంగారం, వెండి.. ఇక నెక్ట్స్ బంగారం అయ్యే మెటల్ ఇదే!
చుక్కలన్నంటిన బంగారం, వెండి.. ఇక నెక్ట్స్ బంగారం అయ్యే మెటల్ ఇదే!
యూపీఐలో పొరపాటున వేరేవారికి డబ్బులు వేశారా..? ఇలా చేస్తే..
యూపీఐలో పొరపాటున వేరేవారికి డబ్బులు వేశారా..? ఇలా చేస్తే..
వామ్మో.. తక్కువకు వస్తుందని బిల్లు లేకుండానే బంగారం కొంటున్నారా?
వామ్మో.. తక్కువకు వస్తుందని బిల్లు లేకుండానే బంగారం కొంటున్నారా?
రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలనుకుంటున్నారా..? ఇది చదివితే..
రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలనుకుంటున్నారా..? ఇది చదివితే..
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
బంగారం ధరలపై పిడుగులాంటి వార్త.. ఎంత పెరుగుతాయంటే..?
బంగారం ధరలపై పిడుగులాంటి వార్త.. ఎంత పెరుగుతాయంటే..?
ఎండిన అల్లం మహిమ.. ప్రతిరోజూ నీటిలో తాగితే శరీరంలో జరిగేది ఇదే..!
ఎండిన అల్లం మహిమ.. ప్రతిరోజూ నీటిలో తాగితే శరీరంలో జరిగేది ఇదే..!
ముల్లంగి అంటే అలెర్జీనా? అయితే ఈ కోలా బాల్స్ రుచి చూడండి..
ముల్లంగి అంటే అలెర్జీనా? అయితే ఈ కోలా బాల్స్ రుచి చూడండి..
ఈగోల వల్లే ఆ సినిమా సరిగ్గా తీయలేకపోయా
ఈగోల వల్లే ఆ సినిమా సరిగ్గా తీయలేకపోయా
తెలంగాణలో మూగజీవాల మారణకాండ.. 100 కుక్కలను చంపి పూడ్చిపెట్టిన..
తెలంగాణలో మూగజీవాల మారణకాండ.. 100 కుక్కలను చంపి పూడ్చిపెట్టిన..