Samantha: బాలీవుడ్లో పాగా వేయనున్న సమంత.. మరో మూడు ప్రాజెక్టులకు సామ్ గ్రీన్ సిగ్నల్ ?..
ప్రస్తుతం సమంత ఫుల్ జోరు మీద ఉంది. విడాకుల తర్వాత సామ్ తిరిగి తన కెరీర్ పై దృష్టి సారించింది. కేవలం హీరోయిన్
ప్రస్తుతం సమంత ఫుల్ జోరు మీద ఉంది. విడాకుల తర్వాత సామ్ తిరిగి తన కెరీర్ పై దృష్టి సారించింది. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా స్పెషల్ సాంగ్స్ చేయడానికి సైతం సామ్ ఓకే చెప్పేస్తుంది. మరోవైపు భాషతో సంబంధం లేకుండా..బాలీవుడ్.. హాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. అలాగే వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ సమంత తన సత్తా చాటుతోంది. ఇటీవల సామ్ నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారింది. ఇందులో రాజీ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది సామ్. అయితే గత కొద్ది రోజులుగా సమంత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే సమంత బాలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. స్టార్ హీరోయిన్ తాప్సీ సొంత ప్రొడక్షన్ బ్యానర్ పై సామ్ ఓ సినిమా చేయబోతున్నట్లుగా టాక్. అలాగే యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రంలోనూ సామ్ నటించబోతున్నట్లుగా సమాచారం. అంతేకాదు.. తమ బ్యానర్లో దాదాపు 3 సినిమాలు చేయాలని సమంతకు ఆఫర్ ఇచ్చినట్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇందుకు సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. ఆ మూవీ చిత్రాలకు గానూ.. సమంత భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటుందట. దీంతో బాలీవుడ్లో వరుస చిత్రాలతో సామ్ ఫుల్ బీజీగా మారిపోనుంది.
ఇదిలా ఉంటే.. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది సామ్. తన లెటేస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు నెట్టింట్లో రచ్చ చేస్తుంది. తాజాగా సామ్.. సోషల్ మీడియాలో ఓ అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్స్ ఫాలోవర్స్ మార్క్ టచ్ చేసింది సమంత.
Also Read: Akhanda: థియేటర్లలో అఖండ విజృంభణ.. ఓవర్సీస్లో బాలయ్య సినిమా మాస్ జాతర..
Akhanda Movie: అఖండ మూవీ థియేటర్ సీజ్.. మ్యాట్నీ షోను అడ్డుకున్న అధికారులు.. ఎందుకంటే..