Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda: థియేటర్లలో అఖండ విజృంభణ.. ఓవర్సీస్‏లో బాలయ్య సినిమా మాస్ జాతర..

నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో హ్యాట్రిక్ వచ్చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన

Akhanda: థియేటర్లలో అఖండ విజృంభణ.. ఓవర్సీస్‏లో బాలయ్య సినిమా మాస్ జాతర..
Akhanda
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 02, 2021 | 5:36 PM

నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో హ్యాట్రిక్ వచ్చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. బాలయ్య నటించిన అఖండ సినిమాతో థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం వచ్చేసింది. గతంలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాల రికార్డులను అఖండతో తిరగరాశారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న బాలకృష్ణ అభిమానులకు అఖండతో మాస్ జాతర చూపించారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈరోజు అఖండ సినిమా విడుదల కావడంతో ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సందడి నెలకొంది. అటు అమెరికా.. ఆస్ట్రేలియా ఇతర దేశాల్లోనూ బాలయ్య మాస్ జాతర షూరు అయిన సంగతి తెలిసిందే.

గత రెండేళ్లుగా డీలా పడ్డ థియేటర్ల యాజమానులకు… దర్శకనిర్మాతలకు అఖండ సినిమా బూస్టింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా ఓవర్సీస్‏లో అత్యధిక ప్రీమియర్ గ్రాసర్ గా అఖండ నిలిచింది. ఏకంగా మూడు లక్షల డాలర్లకు పైగా కేవలం ప్రీమియర్ షోల ద్వారానే రాబట్టింది. ఇంతటి స్థాయిలో ఈ ఏడాదిలో ఏ సినిమా వసూళ్లను సాధించలేకపోయాయి. మరోవైపు.. ఒక్కరోజే మూడు లక్షల డాలర్ల వసూళ్లను రాబట్టిన అఖండ లాంగ్ రన్‏లో రెండు మిలియన్ల డాలర్ల వరకు వెళ్తుందని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. ఇక తాజాగా.. అమెరికా అయినా.. ఆస్ట్రేలియా అయినా.. ఆంధ్ర అియనా.. తెలంగాణ అయినా మాస్ జాతర కొనసాగుతుందంటూ చిత్రయూనిట్స్ పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. ఓనర్సీస్‍లో బాక్సాఫీస్ వద్ద బాలయ్య అఖండతో రికార్డులు క్రియేట్ చేశాడంటూ అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‏గా నటించగా.. విలన్ పాత్రలో శ్రీకాంత్ అదరగొట్టాడు. ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించగా. థమన్ సంగీతం అందించారు.

ట్వీట్..

Also Read: Akhanda Movie: అఖండ మూవీ థియేటర్ సీజ్.. మ్యాట్నీ షోను అడ్డుకున్న అధికారులు.. ఎందుకంటే..

Sara Ali khan: సింగర్ శ్రేయా ఘోషల్‏కు క్షమాపణలు చెప్పిన స్టార్ హీరోయిన్.. ఎందుకంటే..