Samantha: ఉప్పు, చక్కెర లేదు.. మందులే ఆహారమయ్యాయి.. మయోసైటిస్‌పై సమంత ఎమోషనల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గతేడాది మయోసైటిక్ అనే అరుదైన సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటికే నాగచైతన్యతో విడాకులు తీసుకుని విడిపోవడంతో సామ్ వ్యక్తిగత జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీని నుంచి కోలుకుంటున్న సమయంలోనే తనకు మయోసైటిస్ ఉందని బయటపెట్టింది సామ్.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గతేడాది మయోసైటిక్ అనే అరుదైన సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటికే నాగచైతన్యతో విడాకులు తీసుకుని విడిపోవడంతో సామ్ వ్యక్తిగత జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీని నుంచి కోలుకుంటున్న సమయంలోనే తనకు మయోసైటిస్ ఉందని బయటపెట్టింది సామ్. ఈ కారణంగా చాలా రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండిపోయిందామె. అయితే తన మనో నిబ్బరంతో ఆ వ్యాధిని జయించింది. మళ్లీ ఎప్పటిలాగే సినిమాలతో బిజీగా మారిపోయింది. అయితే మయోసైటిస్ బారిన పడి ఏడాదైన సందర్భంగా సమంత ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ వ్యాధి బారిన పడిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులు, తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పులను ఈ పోస్టు ద్వారా షేర్ చేసుకుంది. ప్రస్తుం సెర్బియాలో ఉన్న ఆమె అక్కడ సెర్చ్ ఆఫ్ సెయింట్ సావాను సందర్శిచింది. దీనికి సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన సమంత..
ఎన్నడూ చేయనన్ని పూజలు, ప్రార్థనలు చేశా..
‘మయోసైటిస్ ఉందని తెలిసి ఏడాది అవుతోంది. ఈ సంవత్సరం ఎప్పుడూ ఊహించని సరికొత్త పరిస్థితులను ఎదుర్కొన్నాను. నా శరీరంతో ఎన్నో పోరాటు చేశాను. చక్కెర, ఉప్పులేని ఫుడ్ తిన్నాను. వాస్తవంగా చెప్పాలంటే మెడిసిన్సే ఆహారమయ్యాయి. కొన్నిటిని బలవంతగా మానుకోవాల్సి వచ్చింది. మరికొన్నింటిని ఇష్టం లేకున్నా అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. ఆలోచించడం, ఆత్మ పరిశీలన చేసుకోవడంతోనే ఈ ఏడాది గడిచిపోయింది. ప్రొఫెషనల్ ఫెయిల్యూర్స్‌ను కూడా ఫేస్ చేశాను. ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. ఈ ఏడాది ఎన్నడూ చేయనన్ని పూజలు, ప్రార్థనలు చేశాను. వరాలు, దీవెనల కోసం మాత్రం కాదు. సమస్యలను ఎదుర్కొనే మానసిక శక్తి, ప్రశాంతతను ఇవ్వమని భగవంతుడిని ప్రార్థిచాను. అలాగే జీవితంలో గడ్డు పరిస్థితులు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నాను. నా చేతుల్లో ఉన్నదైతే నేను కంట్రోల్ చేయగలను. లేని దానిని వదిలేయడం అలవర్చుకున్నాను. గతాన్ని గుర్తుచేసుకుంటూ అక్కడే ఆగిపోకూడదు. నన్ను ప్రేమించే వారినే ప్రేమిస్తా. మీలో కూడా చాలామంది జీవితంలో కష్టాలను ఎదుర్కొని ఉంటారు. అలాంటివారి కోసం కూడా నేను ప్రార్థిస్తాను. దేవుళ్లు కొన్ని సార్లు లేట్ చేస్తారేమో కానీ, ఎప్పటికీ మన విజ్ఞప్తులను తిరస్కరించారు. శాంతి, ప్రేమ, సంతోషం, శక్తిని కోరుకుంటే భగవంతుడు ఎప్పుడూ కాదనను. ఈ ప్రపంచంలో ఎలాంటి స్వార్థం లేని అంశాలు ఇదే కదా మరి’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది సమంత.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..