AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: ‘ఆదిపురుష్’ నటీనటుల రెమ్యునరేషన్ వివరాలు.. ప్రభాస్, సైఫ్ పారితోషికం ఎంతంటే..

ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలో నటించిన నటీనటుల రెమ్యునరేషన్ వివరాలపై ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతుంది.దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలోని నటీనటులు కూడా భారీగా పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Adipurush: 'ఆదిపురుష్' నటీనటుల రెమ్యునరేషన్ వివరాలు.. ప్రభాస్, సైఫ్ పారితోషికం ఎంతంటే..
Adipurush
Rajitha Chanti
|

Updated on: Jun 15, 2023 | 6:16 PM

Share

ఆదిపురుష్.. మరికొన్ని గంటల్లో పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు రాబోతున్న సినిమా. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ రూపొందించిన ఈ సినిమా కోసం సినీప్రియులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వెండితెరపై తొలిసారిగా పౌరాణిక చిత్రంలో ప్రభాస్ నటిస్తుండడం… తమ అభిమాన హీరో రాముడిగా కనిపిస్తుండడంతో ఈ మూవీ చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో జూన్ 16న పెద్ద ఎత్తున విడుదల కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలో నటించిన నటీనటుల రెమ్యునరేషన్ వివరాలపై ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతుంది.దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలోని నటీనటులు కూడా భారీగా పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో రాఘవుడిగా ప్రభాస్.. జానకీగా కృతి సనన్ నటిస్తున్నారు. అలాగే రావణ పాత్రలో సైఫ్.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఈ సినిమా కోసం ఏకంగా రూ. 100 నుంచి రూ.150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అలాగే.. రావణుడిగా కనిపించనున్న సైఫ్ అలీ ఖాన్ రూ. 12 కోట్లు తీసుకుంటున్నాడట. అలాగే సీతగా నటిస్తో్న్న కృతి సనన్.. ఏకంగా రూ. 3 కోట్లు తీసుకున్నట్లుగా సమాచారం. ఈ చిత్రంతో మొదటి సారి ప్రభాస్ సరసన నటిస్తుంది కృతి. అంతేకాకుండా.. తెలుగులో వరుసగా పరాజయాలు అందుకున్న ఈబ్యూటీకి ఇప్పుడు ఆదిపురుష్ చిత్రంపైనే ఆశలన్ని ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో కనిపించనున్న సన్నీ సింగ్ రూ.1.5 కోట్లు తీసుకుంటున్నాడట. కీలకపాత్రలో నటిస్తున్న సోనాల్ చౌహాన్ రూ. 50 లక్షలు రెమ్యూనరే,న్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొదట్లో విమర్శలు ఎదుర్కొన్న ఈ సినిమా.. ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలన్ని మారిపోయాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోనుందని నమ్మకంగా ఉన్నారు మూవీ టీం సభ్యులు. మరోవైపు ఆదిపురుష్ చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నారు సినీ, రాజకీయ ప్రముఖులు. ఎప్పుడెప్పుడా అని పాన్ ఇండియా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న ఆదిపురుష్ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో